ఏదైనా కథ ను కొత్తగా చెప్పాలంటే మలయాళం వారు తప్ప మిగతా వారెవ్వరూ వారికి సాటి రారు అని నిరూపిస్తూనే ఉన్నారు.ప్రయోగాలు చేయాలన్నా, ఒక ఇంట్రెస్టింగ్ జోనర్ క్రియేట్ చేయాలన్న మలయాళం వారి తర్వాతే మరి ఎవరైనా.
మన భాషల వారికి అలాంటి ఆలోచన రాదు.వచ్చినా దాన్ని ఎంత పర్ఫెక్ట్ గా తీయలేరు.
ఎందుకు అంటే తెలుగు సినిమా ఒక కమర్షియల్ చట్రం లో ఇరుక్కుని అక్కడే నలుగుతూ ఉంది కాబట్టి.అందుకే ఇప్పుడు మలయాళంలో వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ సినిమా గురించి తెలుసుకుందాం.
క్రైమ్ థ్రిల్లర్( Crime thriller ) గా తెరకెక్కి ఈ చిత్రంలో నెట్ఫ్లిక్ లో ఉంది.
కేవలం గంటన్నర సమయం మాత్రమే ఉన్న ఈ సినిమా గత ఏడాది విడుదల అయింది.జాలీ జోసెఫ్( The Jolly Joseph Case ) అనే ఒక గృహిని తనకు నచ్చని వారిని చంపుకుంటూ వెళ్లిన ఈ కథలో అనేక ట్విస్టులు ఉన్నాయి.కేరళలో సైనేడ్ కిల్లింగ్స్ అనే పేరుతో చాలా పాపులర్ అయింది ఈ కేసు.
నిజజీవితంలో జరిగిన ఈ సంఘటనలే సినిమాగా తీశారు.తనకి ఎవరైనా నచ్చకపోతే సైనేడ్ పెట్టి చంపేయడం.
ఇది ఒక గృహిని చేసిన హత్యల కథ.మరి 14 ఏళ్ల తర్వాత ఈ హత్యలు ఆమెనే చేసింది అని ఎలా బయటపడింది.మరి ఇంత మంది పై ఆమెకు కోపం ఎందుకు వచ్చింది ? సైలెంట్ గా సైనేడ్ ఇచ్చి ఎందుకు చంపుతూ వెళ్ళింది అనేది ఇప్పటి వరకే పేపర్స్ లో మీడియాలో మనం చూసాం.
అయితే ఆమెను ఎవరు అనుమానించకపోగా ఆ హత్యలన్నీ కూడా గుండెపోటు లేదా సహజ మరణాలు అనుకొని పోస్ట్ మార్టం కూడా చేయకుండా అంత్యక్రియలు నిర్వహించడంతో ఆమె వ్యవహారం బయటకు పోలేదు.కానీ 14 ఏళ్ల తర్వాత ఆమె ఆడపడుచుకు అనుమానాలు రావడంతో అసలు కథ మొదలైంది.ఆ తర్వాత ఎందుకు ఆమె హత్యలు చేసింది ? ఎలా దొరికింది అనే విషయాలను సినిమాలో చూపించారు.ఇక ఈ సినిమా పూర్తిస్థాయి నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కడంతో సినిమా లిబర్టీ తీసుకోవడానికి లేదు.ఉన్నది ఉన్నట్టుగానే చూపించే ప్రయత్నం చేయాలి.గంటన్నర పాటు ఎలాంటి బోర్ కొట్టకుండా తనదైన మేకింగ్ తో, ఎడిటింగ్ తో, స్క్రీన్ ప్లే తో రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.దమ్ముంటే తెలుగు వాళ్ళు ఇలాంటి ఒక సినిమా తీస్తే బాగుండు అని కోరుకొని ప్రేక్షకులు ఉండరు.