నటి లక్ష్మి( Actress Lakshmi ).ప్రస్తుతం ఈమె సినిమాల కన్నా కూడా ఎల్లప్పుడూ ఆమె చేసుకున్న మూడు పెళ్లిళ్ల ( Three weddings )గురించే సోషల్ మీడియాలో వార్తలు కనిపిస్తూ ఉంటాయి.
ఎవరికి మాత్రం సరదా ఉంటుంది చెప్పండి పెళ్లిపైన పెళ్లి చేసుకోవాలని.వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో మనకెలా తెలుస్తుంది.
కావాలని ఎవరు జీవితాన్ని నాశనం చేసుకోరు కదా ? ఎందుకు సోషల్ మీడియా ఎప్పుడూ నెగటివ్ గానే ఆలోచిస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు అనేది అర్థం కాని విషయం.నటి లక్ష్మీ సైతం ఆమె మూడు పెళ్లిళ్ల విషయంలో ఎన్నో పొరపాటు చేసి ఉండొచ్చు.
జీవితంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో కూడా ఆమె తొందరపడి ఉండవచ్చు.కానీ ఆమె ఎవరికి అన్యాయమైతే చేయలేదు కదా.
కాసేపు ఆమె ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనే విషయాన్ని పక్కన పెట్టి ఎందుకు విడిపోయారు అన్నదాని గురించి ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.మొదటిగా భాస్కరన్( Bhaskaran ) ని పెళ్లి చేసుకున్న సమయంలో ఆమె వయసు కేవలం 17 ఏళ్ళు మాత్రమే.19 ఏళ్లకు కూతురు ఐశ్వర్య ( Aishwarya ) పుట్టింది.ఆ సమయంలో లక్ష్మికి భాస్కరన్ సినిమాల విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో నటించమని ఆయన చెప్పారు.అందుకే ఆమెకు ఎలాంటి అడ్డు అదుపు లేకుండా పెద్ద సినిమాల్లో నటించే అవకాశం దొరికింది.
కానీ సినిమాల్లో బిజీ అయిన తర్వాత కూతుర్ని కూడా పట్టించుకునే అవకాశం లేకపోవడంతోనే విడాకుల వరకు వెళ్ళింది విషయం.
ఇక రెండవ సారి విడాకుల విషయం నటుడు మోహన్( Mohan ) గురించి.ఆయన ఇటీవల ఇంటర్వ్యూలో కుక్కల నా దగ్గర పడి ఉంటుంది అని పెళ్లి చేసుకున్నాను అని, ఆమె అదే మాట చెప్పింది లక్ష్మీ అంటూ కామెంట్ చేశారు.ఒక ఆడది కుక్కలా పడి ఉంటేనే పెళ్లి చేసుకుంటారా ? అలాంటప్పుడు కుక్కనే పెళ్లి చేసుకోవచ్చు కదా అనేది లక్ష్మీ వాదన.ఎవరి అహానికి తను తలవంచ తలచుకోలేదు.అందుకే మగవాడి ఆధిపత్యం ముందు తను కూడా గట్టిగానే నిలబడాలని రెండవసారి విడాకులు తీసుకుంది.ఇక శివ చంద్రన్ అయినా మూడో భర్త విషయంలో ఈ వివాహం నిలబడింది.ముగ్గురు భర్తల విషయంలో ఆమె ఎక్కువగా శివచంద్రన్( Sivachandran ) తోనే సంతోషంగా ఉన్నానంటూ ఎన్నోసార్లు చెప్పింది.
లక్ష్మికి విడాకులు తీసుకోవడానికి ప్రతిసారి ఆమెను డామినేట్ చేసే భర్త దొరకడమే కారణం కావచ్చు.