నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో మైగ్రేన్ తలనొప్పి వేధిస్తోంది.తట్టుకోలేనేంత బాధ కలిగించే వ్యాధుల్లో ఇది ఒకటి.
ఈ మైగ్రేన్ చాలా మందిలో తలకు ఓ వైపు మాత్రమే వస్తుంది.పైగా, మైగ్రేన్ సమయంలో తీవ్రమైన చికాకు, కంటి చూపు మందగించడం, చిన్న శబ్దాలను కూడా తట్టుకోలేకపోవడం, మానసిక స్థితి సరిగ్గా ఉండక పోవడం, ఆకలి లేకపోవడం, వెలుతురును భరించలేకపోవడం, వాంతులు ఇలా ఎన్నో సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి.
వీటి నుంచి బయటపడేందుకు.మైగ్రేన్ ను తగ్గించు కునేందుకు ఎన్నో మందులు వాడుతుంటారు.
అయితే మైగ్రేన్‌ను సహజంగా నివారించడంలో కొన్ని కొన్ని పండ్లు గ్రేట్‌గా సహాయ పడతాయి.మరి ఆ పండ్లు ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయ.దీనిని పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టంగా తింటుంటారు.
పుచ్చకాయలో వాటర్ కంటెంట్‌తో పాటుగా బోలెడన్ని పోషకాలు కూడా నిండుగా ఉంటాయి.అందుకే పుచ్చకాయ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ముఖ్యంగా మైగ్రేన్‌తో బాధ పడే వారు ప్రతి రోజూ ఒక కప్పు పుచ్చ ముక్కలు లేదా ఒక గ్లాస్ పుచ్చకాయ జ్యూస్ తీసుకుంటే శరీరంలోని ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి.దాంతో మైగ్రేన్ కు దూరంగా ఉంటారు.
అరటి పండు కూడా మైగ్రేన్‌కు చెక్ పెట్టడంలో సూపర్‌గా హెల్ప్ చేస్తుంది.ప్రతి రోజు ఒకటి, రెండు అరటి పండ్లను తీసుకుంటే.అందులో పుష్కలంగా ఉంటే మెగ్నీషియం మైగ్రేన్ తల నొప్పిని సమర్థవంతంగా తగ్గిస్తుంది.
అంజీర్ పండ్లు.వీటి ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు కలిగి ఉంటాయి.ముఖ్యంగా మైగ్రేన్ బాధితులు వీటని రెగ్యులర్‌గా తీసుకుంటే.
చాలా మంచిది.ఇక మైగ్రేన్ తలనొప్పి తీవ్రంగా వేధిస్తున్నప్పుడు.
యాపిల్ తిన్నా ఉపశమనాన్ని పొందొచ్చు.