హిందూ ధర్మం( Hindu Dharma )లో వివాహం అయినా మహిళలు తమ భర్తల క్షేమం కోసం నోములు, వ్రతాలు కూడా చేస్తారు.వివాహితలకు శ్రావణమాసం అనగానే ఈ మాసంలో వరలక్ష్మి దేవి పూజ గుర్తుకొస్తుంది.
అటువంటి వరలక్ష్మి పూజ ఎలా వచ్చింది.ఎవరు ఈ పూజ విశిష్టత గురించి చెప్పారు.
ఎవరికి చెప్పారు అనే విషయం కూడా ప్రధానమైనది.శ్రావణమాసంలో ప్రధానమైన పండుగలలో వివాహితులు చేసుకునే వరలక్ష్మి వ్రతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళలకు సౌభాగ్యదాయకమైన వ్రతం ఏదైనా ఉందా స్వామి అంటూ పార్వతీదేవి తన భర్త అయినా పరమశివుడిని( Lord Shiva ) అడిగింది.దానికి శివుడు సౌభాగ్యమే కాదు అష్ట ఐశ్వర్యాలతో పాటు సుఖసంతోషాలను కలిగించే వ్రతం ఉంది దేవి అదే వరలక్ష్మి వ్రతం అని తెలిపారు.లయకారుడైన పరమశివుడు పార్వతి దేవికి చెప్పిన ఆ కథ ఏమిటి? దాన్ని విశిష్టతతో పాటు ఒక సాధారణ ఇల్లాలినీ వరలక్ష్మి దేవి ఎలా కరుణించింది.ఎటువంటి వరాలు కురిపించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
మగధ దేశంలో కుండినము( Kundinamu ) అనే పట్టణం ఒకటి ఉండేది.ఆ పట్టణమంతా లక్ష్మీదేవి స్వరూపమైన బంగారం ఎక్కడ చూసినా కనిపించేది.

ఆ పట్టణంలో చారుమతి( Charumati ) అనే ఒక బ్రాహ్మణ మహిళ ఉండేది.ఆమె సుగుణవతి పెద్దలుంటే వినయం, విధేయత కలిగిన మహిళ.అత్తమామలను, భర్తను వారి బాగోగులను చూసుకునే యోగ్యురాలు.ఆమె రోజు తెల్లవారుజామున నిద్ర లేచి భర్త పాదాలకు నమస్కరించి ఇంట్లో పనులు పూర్తిచేసుకుని అత్తమామల్ని గౌరవ మర్యాదలతో సేవించేది.
వరలక్ష్మి దేవి చారుమతికి కలలో కనిపించి నీవు యోగ్యురాలైన మహిళవి అందుకే నిన్ను కరుణించాలని వచ్చాను.ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నన్ను పూజించు.
నీవు కోరిన వరాలు, కానుకలు, సకల సౌభాగ్యాలు ఇస్తాను అని చెప్పింది.అప్పుడు చారుమతి వరలక్ష్మి దేవి చెప్పినట్లుగానే శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఇరుగుపొరుగు ముత్తైదువులను పిలిచి అమ్మవారిని చక్కగా అలంకరించింది.
భక్తిశ్రద్ధలతో పూజ చేసి, అత్యంత భక్తితో పలు రకాల పిండి వంటకాలతో నైవేద్యం పెట్టింది.అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసే సమయంలో చారుమతికి ముత్తైదువులకు అద్భుతమైన వరాలు వచ్చి చేరాయి.