చిరు 152 లుక్‌ లీక్‌తో చరణ్‌ వారికి క్లాస్‌

చిరంజీవి 152వ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది.ఈ చిత్రంకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.

 Charan Take The Class To Chiru 152 Movie Leaked Chiranjeevi Look-TeluguStop.com

ఈ సినిమాలో చిరంజీవి ఎలా కనిపించబోతున్నాడు, అసలు సినిమా కథ ఏంటీ అనే విషయాలపై వందలకు పైగా వార్తలు వచ్చాయి.ఎట్టకేలకు ఒక్క లీక్‌ అయిన ఫొటోతో ఆ వార్తలన్నీంటికి బ్రేక్‌ పడ్డట్లయ్యింది.

చిరంజీవి విప్లవ భావాలు ఉన్న ఒక రచయిత పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఆయన లీక్‌ అయిన ఫొటోతో క్లారిటీ వచ్చేసింది.

Telugu Charan, Charanclass, Koratalasiva, Ram Charn-Movie

మాజీ నక్సలైట్‌ పాత్రలో.ఉద్యమ నాయకుడిగా ఆయన కనిపించబోతున్నట్లుగా ఈ స్టిల్‌ చూస్తుంటే అనిపిస్తుంది అంటూ ప్రచారం జరుగుతోంది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంకు సంబంధించిన చిరంజీవి లుక్‌ రివీల్‌ అవ్వడంపై నిర్మాత రామ్‌ చరణ్‌ చాలా అసహనం వ్యక్తం చేస్తున్నాడు.

చాలా క్వాలిటీతో చిరంజీవి ఫొటో లీక్‌ అవ్వడంతో అది ఖచ్చితంగా యూనిట్‌ సభ్యుల్లో ఒకరి పని అంటూ చరణ్‌ భావిస్తున్నాడు.

Telugu Charan, Charanclass, Koratalasiva, Ram Charn-Movie

లీక్‌ చేసిన వారు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.కోట్లు పెట్టి నిర్మిస్తున్న సినిమా సినిమాకు సంబంధించిన సీక్రెట్‌ను ఇలా ముందే లీక్‌ చేయడం వల్ల సినిమాకు చాలా నష్టం అని, ఆ నష్టంకు కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా ఈ సందర్బంగా చరణ్‌ భావిస్తున్నాడు.మరి ఆ లీక్‌ వీరులు ఎవరో అనే విషయాన్ని చరణ్‌ ఎలా కనిపెడతాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube