టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా, యాంకర్ గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న శ్యామల గురించి అందరికీ సుపరిచితమే.కెరీర్ మొదట్లో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను సందడి చేస్తున్న ఈమె అనంతరం పలు సినిమాలలో కూడా నటించారు.
ఇకపోతే సీరియల్ లో నటిగా తన కెరియర్ ప్రారంభించిన శ్యామల యాంకర్ గా కొనసాగుతున్నారు.ప్రస్తుతం ఈమె ఎన్నో సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.
ఇకపోతే నటుడు నరసింహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే ఇక ఈ దంపతులు ఓ కుమారుడికి జన్మనిచ్చారు.ఇలా ఒకవైపు యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇకపోతే తాజాగా శ్యామల తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఎరుపు రంగు డ్రెస్సులో ఏంజెల్ లా మెరిసిపోతూ ఉన్నటువంటి శ్యామల తన కొడుకుతో లిప్ టు లిప్ కిస్ ఇస్తున్న ఫోటోలను షేర్ చేశారు.ఇలా కేక్ కటింగ్ కి సంబంధించిన ఫోటోలతో పాటు పలువురు స్నేహితుల సమక్షంలో ఈమె తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.ఇకపోతే శ్యామల పుట్టినరోజు వేడుకలలో భాగంగా డైరెక్టర్ బుచ్చిబాబు కూడా హాజరైనట్లు తెలుస్తోంది.ఇలా యాంకర్ శ్యామల పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎంతోమంది ఈమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
k