సినిమా రంగంలో పవన్ అలీ కాంబినేషన్ కు ప్రత్యేకత ఉంది.తను హీరోగా నటించిన సినిమాలలో అలీకి పవన్ కళ్యాణ్ అవకాశాలు ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి.
పవన్ అలీ కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.అయితే తాజాగా పవన్ పై అలీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
వైసీపీ పదవి ఇచ్చిన నేపథ్యంలో అలీ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసి బుద్ధి చూపించారు.
పవన్ వైసీపీ పదవిలో ఉండటంలో తప్పు లేదని అయితే పవన్ ను టార్గెట్ చేసి విమర్శలు చేయడం మాత్రం సరికాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అలీ ఈ కామెంట్ల విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.అలీ పవన్ మధ్య ఈ మాటలు గ్యాప్ పెంచేలా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అలీ సక్సెస్ కావడంలో పవన్ అభిమానుల పాత్ర కూడా కొంతమేర ఉందనే సంగతి తెలిసిందే.
అలీ రాజకీయంగా టార్గెట్ చేయాలని అనుకుంటే ఎంతో మంది రాజకీయ నేతలు ఉన్నారని పవన్ కళ్యాణ్ ను ఆయన టార్గెట్ చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా కలిగే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.
గతంతో పోలిస్తే అలీకి సినిమా ఆఫర్లు కూడా తగ్గాయనే సంగతి తెలిసిందే.అలీ నటించిన అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మూవీ ఆహా ఓటీటీలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోలేదు.

గతంతో పోల్చి చూస్తే అలీ రెమ్యునరేషన్ కూడా తగ్గింది.పలు రియాలిటీ షోలకు అలీ హోస్ట్ గా వ్యవహరిస్తుండగా ఆ షోలకు మంచి రెస్పాన్స్ రాలేదు.అలీ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.అలీ ఈ తరహా విమర్శలు చేస్తే భవిష్యత్తులో ఇతర రాజకీయ పార్టీలు ఆయనను నమ్మే ఛాన్స్ అయితే ఉంది.