ఇప్పటికి చక్రి పేరు తల్చుకుంటే గుర్తచ్చేది ఆ సినిమానే !

చక్రి.మధురమైన సంగీతంతో మర్చిపోలేని పాటలతో తెలుగు ప్రేక్షకులను మత్తులో ఉంచి, మాయ చేసి ఆ మంచు కరిగేలోపే కనుమరుగైన ధ్రువ నక్షత్రం.

 Chakri Wil Be Known With Sathyam Movie After Years , Chakri, Sathyam Movie, Fil-TeluguStop.com

సినిమా ఇండస్ట్రీ కి ఎందరో వస్తారు, తమ పరిధిలో ఎంతో చేస్తారు కానీ అందరిని గుర్తు పెట్టుకోవాలని ఏం లేదు.కానీ కొంత మందిని మాత్రం ఎంత మర్చిపోదాం అనుకున్న కూడా వారికి సంబందిచ్న్హిన కొన్ని జ్ఞాపకాలు ఆలా చేయనివ్వవు .నిత్యం తన పాటలతో తెలుగు ప్రేక్షకులను తన బానిసలుగా చేసుకొని అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోయాడు.ఈ విషయం మన అందరికి తెలిసిందే.

కానీ అనునిత్యం తన సంగీతం మాత్రం మన తో పాటే ప్రయాణం చేస్తూ ఉంటుంది.అందుకే ఈ ప్రపంచంలో కాలాన్ని బందించి తమ జ్ఞాపకాలను ముందు తరాల వారికి ఇవ్వగలిగే సత్తా కేవలం ఒక్క సినిమ ఇండస్ట్రీ వారికే సొంతం.

ఆలా చక్రి ఎప్పుడు గుర్తచ్చిన అయన చేసిన ఎన్నో పాటలు మన మనసును హత్తు కుంటాయి.రాస్తున్న నాకైతే సత్యం సినిమా లో సీన్ వచ్చిన, బ్యాగ్రౌండ్ స్కోర్ విన్నాకూడా ఆయనే కళ్ల ముందు సాక్షాత్కారం అవుతారు.

బాచి సినిమాతో తన సినిమా ప్రయాణం మొదలు పెట్టి 2016 వెన్నెల్లో హాయ్ హాయ్ సినిమా వరకు 16 ఏళ్లలో ఏకంగా 85 సినిమాలకు సంగీతం అందించడం అంటే మాటలు కాదు.అయన కెరీర్ లో ఎన్నో హ్యాట్రిక్ లు ఉన్నాయ్.

Telugu Chakri, Filmfare Award, Sathyam, Simha, Tollywood-Telugu Stop Exclusive T

సత్యం సినిమా విషయానికి వస్తే ఆ సినిమాలో మంచి క్యారెక్టరైజేషన్ తో పాటు అద్భుతమైన ఫీల్ ఉంటుంది.ప్రతి ఒక్కడు తనను తాను హీరోలో ఊహించుకోవచ్చు.సుమంత్ కెరీర్ లో ఒక మర్చిపోలేని మైలు రాయి.ఈ సినిమాలో పాటలు ఒక్కొక్కటి ఒక్క్కో అద్భుతం.ఒక క్లాసిక్ లవ్ స్టోరీ కి ఉండాల్సిన ఫీల్, బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాటు మ్యూజిక్ కూడా మంచి రోల్ పోషించింది.ఈ సినిమాకు సంగీత అందించినందుకు గాను ఫిలిం ఫెర్ అవార్డు కూడా అందుకున్నాడు.

ఇక పూరి జగన్నాద్ తో ఎక్కువ సినిమాలకు పని చేసిన చక్రికి సింహ చిత్రానికి నంది అవార్డు లభించింది.ఇక నిద్రలోనే కన్నుమూసిన చక్రి మన మధ్య లేకపోయినా అయన పాటలు మాత్రం ఎప్పుడు మనలోనే ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube