ఈ రోజుల్లో ఎవరు కూడా ఆహార నియమాలను పాటించడం లేదు.సకాలంలో భోజనం చేసిన వారు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పవచ్చు.
కొందరైతే పొద్దున ఏమి తినకుండా డైరెక్ట్ గా సాయంత్రం నాలుగు గంటలకి భోజనం చేస్తుంటారు.అలానే రాత్రి 11-12 గంటల సమయంలో డిన్నర్ చేస్తుంటారు.
కొందరేమో డబ్బు సంపాదనలో పడి భోజనం చేయడం మానేస్తుంటే.మరికొందరు తినడానికి కూడా బద్ధకం వేసి తినడం మానేస్తున్నారు.
కొందరు టీవీ చూస్తూ మొబైల్ వాడుతూ తిండి మీద కాసింత కూడా శ్రద్ధ పెట్టడం లేదు.అయితే ఇలాంటి ఆహారపుటలవాట్ల వల్ల ఆరోగ్యం సర్వనాశనం అయ్యే ప్రమాదం ఉంది.
సాధారణంగా వేళకు తిండి తినకపోతే కొందరికి తీవ్రమైన తలనొప్పి వస్తుంది.అలా ఎందుకు జరుగుతుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరానికి కావలసిన ఆహారం సకాలంలో దొరకకపోతే మెదడు అనేది సంకేతాలు పంపిస్తూనే ఉంటుంది.అప్పుడు శరీరం మొత్తం కూడా అసౌకర్యానికి గురి అవుతుంది.అలాగే శరీరంలో శక్తి అనేది బాగా తగ్గుతుంది.మరోవైపు మెదడు అనేది ఆహారం తీసుకున్నా, తీసుకోకపోయినా పని చేస్తూనే ఉండాలి.
అప్పుడు దానిపై ఎక్కువగా ఒత్తిడి పడుతుంది.తగినంత శక్తి మెదడు అందక తలనొప్పి ప్రారంభం అవుతుంది.

ఎప్పుడైతే నీటిని, ఆహారాన్ని అసలు ముట్టకుండా గంటల తరబడి వర్క్ చేస్తూ ఉంటామో అప్పుడు మెదడుకు అందే ఆక్సిజన్, శక్తి పూర్తిగా తగ్గుతుంది.దానివల్ల తీవ్ర తలనొప్పి వాటిల్లుతుంది.ఇలాంటి తలనొప్పిని పోగొట్టాలంటే ఆహారం తినడంతో పాటు తరచుగా నీళ్లు తాగటం చెయ్యాలి.ఒకేసారి కాకుండా ప్రతి గంటకు ఒకసారి కొద్ది కొద్దిగా ఆహారం తింటూ ఉంటే మెదడుకి కావలసిన శక్తి లభిస్తుంది.