తెలంగాణలో బీజేపీ పర్యటనను అడ్డుకుంటామనడం సరికాదని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు.ప్రధాని పర్యటన సందర్భంగా ఆందోళనలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు తగలడం సరైన పద్ధతి కాదని చెప్పారు.అందరం కలిసి తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే ప్రగతి సాధ్యమవుతుందని ఆయన వ్యాఖ్యనించారు.







