సల్మాన్ రష్డీ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సల్మాన్ రష్దీ( Salman Rushdie ) భారతీయ సంతతికి చెందిన బ్రిటీషు నవలా రచయిత అని చెప్పుకోవచ్చు.1981లో తన 2వ నవల అయినటువంటి “మిడ్‌నైట్ చిల్డ్రన్”( Midnight’s Children ) బుకర్ ప్రైజు గెలుచుకోవడంతో సల్మాన్ రష్డీ పేరు ప్రపంచమంతా వినబడింది.ఈయన ప్రారంభంలో వ్రాసిన కాల్పనిక సాహిత్యమంతా భారత ఉపఖండము నేపథ్యంగాచేసుకొని రచించబడినదే.
అందుకే ఈయన రాత శైలిని చారిత్రక కాల్పనికతతో మిళితమైన మాజిక్ రియలిజంగా మేధావులు వర్గీకరిస్తూ ఉంటారు.

ఈ క్రమంలో ఈయన రాసిన 4వ నవల “శటానిక్ వర్సెస్”( Satanic Vs ) (సైతాను వచనాలు) సంచలనాత్మక, వివాదాస్పద నవల అయింది.ఇది అనేక దేశాలలో నిషేధించబడింది కూడా.ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ముస్లింలు దీనికి వ్యతిరేకంగా నిరసనలు చేసారు.
ఈ నేపథ్యంలో చావు బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాడు.ముంబైలో జన్మించిన ఇతడు, ప్రస్తుతం ఇంగ్లాండు పౌరసత్వం తీసుకున్నాడని విషయం విదితమే.
ఇక అసలు విషయంలోకి వెళితే, సల్మాన్ రష్డీ చాన్నాళ్ల తర్వాత బహిరంగంగా కనబడడం అనేక చర్చలకు దారి తీస్తోంది.

అవును, సల్మాన్ రష్దీ చాన్నాళ్ల తర్వాత బహిరంగంగా కనిపించాడు.గత ఏడాది ఆగస్టులో అనూహ్యంగా ఓ వ్యక్తి చేతిలో దాడికి గురైన సల్మాన్ రష్డీ ఇప్పుడు ప్రాణాలతో బతికి ఉండడం వైద్య పరంగా గొప్ప విషయమే అని చెప్పుకోవాలి.అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన ‘పెన్ అమెరికా’( Pen America ) ఈవెంట్ కు రష్డీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచమనే ఈ పుస్తకంలో మానవ హక్కుల కోసం ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుందన్నారు రష్డీ.
తనను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని, కత్తిపోట్లకు గురయిన తనను కాపాడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.