వైసీపీలో( YCP ) ఉన్న సమయంలో మూవీ ఆఫర్లు తగ్గడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న పృథ్వీరాజ్( Prithviraj ) కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం ద్వారా ఆ పార్టీకి రాజీనామా చేయాల్సి ఉంది.ఆ తర్వాత జనసేన తరపున పని చేస్తున్న పృథ్వీరాజ్ పలు సందర్భాల్లో వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
అయితే ఈ వివాదం వల్ల లైలా బాయ్ కాట్( Laila Boy Kat ) అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రెండింగ్ లోకి వచ్చింది.
అయితే హీరో విశ్వక్ సేన్, సాహో ( Hero Vishwak Sen, Saaho )గారపాటి క్షమాపణలు చెప్పినా వైసీపీ అభిమానులు మాత్రం కూల్ కాలేదు.
అయితే వైసీపీ అభిమానుల నుంచి వార్నింగ్స్ వస్తున్న నేపథ్యంలో బీపీ పెరిగి హైబీపీతో పృథ్వీరాజ్ ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం అందుతోంది.పృథ్వీరాజ్ ఎఫెక్ట్ లైలా సినిమాపై ఎంతమేర పడుతుందో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

వైసీపీ వాళ్లకు క్షమాపణలు చెప్పేదే లేదంటూ పృథ్వీరాజ్ కామెంట్లు చేశారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.భవిష్యత్తులో పృథ్వీరాజ్ కు మూవీ ఆఫర్లు రావడం కూడా కష్టమవుతుందని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.పృథ్వీరాజ్ పొలిటికల్, సినీ కెరీర్ ప్రమాదంలో పడినట్టేనని కచ్చితంగా చెప్పవచ్చు.

భవిష్యత్తులో సినిమా ఈవెంట్లలో రాజకీయాల గురించి మాట్లాడటం మంచిది కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.లైలా సినిమాపై అంచనాలు పెంచడానికి విశ్వక్ సేన్ తన వంతు కష్టపడుతున్నారు.లైలా సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లైలా సినిమా సక్సెస్ సాధించడం విశ్వక్ సేన్ కెరీర్ కు కీలకమనే సంగతి తెలిసిందే.విశ్వక్ సేన్ లైలా సినిమా తెలుగు వెర్షన్ మాత్రమే థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం.