ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.ఈ సినిమా అల్లు అర్జున్ కు ఎంత కలిసి వచ్చిందో.
ఇటు హీరోయిన్ గా చేసిన రష్మికకు కూడా అంతే కలిసి వచ్చింది.ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ అన్ని ఇండస్ట్రీలలో బిజీ అయ్యింది.
పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక పోషించిన డీ గ్లామర్ రోల్ కు ఈ అమ్మడు అన్ని ఇండస్ట్రీ లలో మంచి మార్కులు కొట్టేసింది.దీంతో వరుస అవకాశాలు వరించాయి.
ప్రెజెంట్ బాలీవుడ్ లో బిజీ బిజీగా గడుపుతుంది.ఇటీవలే సీతా రామం సినిమాలో గెస్ట్ రోల్ పోషించి మంచి మార్కులు వేయించుకుంది.
ఇక ఇప్పుడు ఈమె నటించిన బాలీవుడ్ సినిమా’గుడ్ బై త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించింది.
ఆయన కూతురు పాత్రలో రష్మిక నటించింది.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో రష్మిక ఆసక్తికర విషయాలను తెలిపింది.ఈమె నటించ బోతున్న పుష్ప 2 షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పుకొచ్చింది. పుష్ప 2 మరొక రెండు రోజుల్లో షూట్ స్టార్ట్ కాబోతుంది అంటూ చెప్పడం ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చింది.సుకుమార్ పక్క ప్లానింగ్ తో మరింత పక్కా స్క్రిప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు.
అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఫస్ట్ పార్ట్ కంటే మరింత ఎక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.







