మాజీ డీసీపీ రాధాకిషన్ రావు( Radhakishan Rao )కు మధ్యంతర బెయిల్ వచ్చింది.ఈ మేరకు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.
రాధాకిషన్ రావు తల్లి మృతిచెందడంతో ఆయనకు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ను ఇచ్చింది.ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి రేపు సాయంత్రం 6 గంటల వరకు రాధాకిషన్ రావుకు ఈ మధ్యంతర బెయిల్ వర్తించనుంది.
అయితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు( Phone tapping case )లో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.కాగా మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు.