శ్రీదేవి కోసం వెళ్లి బాల్కనీ నుంచి దూకేసిన భోని కపూర్.. మామూలు ప్రేమ కాదు కదా !

బోని కపూర్ శ్రీదేవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే విషయం మన అందరికీ తెలిసిందే.అయితే ప్రేమలో పడ్డాక కొన్నిసార్లు ఏం చేస్తున్నామో తెలియకుండా ఉంటుంది.

 Sridevi Boney Kapoor Love Story Details, Sridevi, Boney Kapoor, Sridevi Boney Ka-TeluguStop.com

ఒక్కోసారి ఎవరు ఊహించని పనులు కూడా చేస్తూ ఉంటారు.బాలీవుడ్లో బడా ప్రొడ్యూసర్ గా ఉన్న బోని కపూర్( Boney Kapoor ) బాల్కనీ నుంచి కూడా దూకాల్సి వచ్చిందట శ్రీదేవి( Sridevi ) కోసం.

మరి ఆ సాహసం ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని ఇటీవల శ్రీదేవి మరణించిన తర్వాత తన కుమార్తె జాన్వి కపూర్( Janhvi Kapoor ) ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు.మరి ఆ ప్రేమ కహాని ఏంటి జరిగిన విషయం ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Bollywood, Boney Kapoor, Heroin Sridevi, Janhvi Kapoor, Sridevi, Sridevib

శ్రీదేవి మరియు బోనీ కపూర్ ల వివాహానికి ముందు చాలా రోజుల పాటు వారు రహస్యంగా డేటింగ్ చేశారు.ఎందుకంటే బోనికి అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు అందుకే హఠాత్తుగా పెళ్లి చేసుకోవడానికి శ్రీదేవికి అలాగే బోనీకపూర్ కి కొన్ని అడ్డంకులు వచ్చాయి.ఈ లోపు ఈ ప్రేమ పక్షులు చాలానే విహరించారు.ఒకరోజు బెంగుళూరులో షూటింగ్ చేస్తున్న శ్రీదేవితో బోని కపూర్ ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నారట.మామూలుగా శ్రీదేవి ఫోన్లో చాలా తక్కువగానే మాట్లాడుతారట.ఇవతల వైపు ఉన్న బోనీ కపూర్ మాత్రమే మాట్లాడుతూ ఉంటే శ్రీదేవి ‘ఊ’ కొడుతూ ఉండేదట.

అయితే అలా బోనీ మాట్లాడుతున్న మాటలు వింటూ వింటూ శ్రీదేవి నిద్రలోకి వెళ్లిపోయిందట.

Telugu Bollywood, Boney Kapoor, Heroin Sridevi, Janhvi Kapoor, Sridevi, Sridevib

తను లేచే సరికి శ్రీదేవికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారట బోనీ కపూర్.అలా ఉన్నఫలంగా రాత్రి బొంబాయి నుంచి ఫ్లైట్ లో బెంగుళూరు( Bengaluru ) వెళ్లిపోయారట.ఇక వెళ్ళగానే శ్రీదేవి బోనీ ని చూసి చాలా షాక్ అయ్యారట అప్పటికే తన టీమ్ అంతా కూడా శ్రీదేవి ఉన్న రూమ్ కి వస్తున్నారట.

కారిడార్ వరకు వచ్చిన వారిని శ్రీదేవి చూసి ఉన్న ఫలంగా బోనిని బయటకు వెళ్లిపొమ్మని చెప్పిందట.దాంతో ఎటు వెళ్ళాలో అర్థం కాని బోనీ కపూర్ బాల్కనీ నుంచి కిందకి దూకేసారట.

ఇలా మొత్తానికి శ్రీదేవి తో ప్రేమలో పడ్డందుకు బోనీ బాల్కనీ నుంచి దూకాల్సి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube