వైరల్ వీడియో: "కింగ్" కోహ్లీ అంటే ఆ మాత్రం సెక్యూరిటీ ఉండాల్సిదే..

ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 మెగా టోర్నీకి సంబంధించి అమెరికా, వెస్టిండీస్ ( America, West Indies )దేశాలు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.మొదటిసారిగా ఐసీసీ ఈవెంట్ లో భాగంగా ఏకంగా 20 దేశాల నుంచి జట్లు ఒక ఈవెంట్ లో పాల్గొంటున్నాయి.

 Viral Video: Kohli Security At Nassau County International Cricket Stadium, Vir-TeluguStop.com

జూన్ ఒకటో తారీకు నుంచి మొదలైన మెయిన్ ట్రోఫీ మొత్తం 21 రోజులు కొనసాగనుంది.ఇక టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్లో బాంగ్లాదేశ్ తో ఆడి 60 పరుగుల పైన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

జూన్ 5న టీమిండియా తన మొదటి మ్యాచ్ ను ఐర్లాండ్ జట్టుతో తలపడనుంది.ఇకపోతే మొదటి వామప్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ( Virat Kohli) గైర్హాజరైన సంగతి తెలిసిందే.

దీనికి కారణం విరాట్ కోహ్లీ కాస్త ఆలస్యంగా టీంతో కలవడం.

ఇకపోతే విరాట్ కోహ్లీ టీమిండియా సభ్యులలో చేరేందుకు నసావు కౌంటీ మైదానానికి చేరిన సమయంలో అతడికి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేసిన విషయం మనం తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో చూడవచ్చు.అయితే ఎప్పుడు చూడని విధంగా విరాట్ కోహ్లీకి అమెరికా స్థానిక పోలీసులు కల్పించడం చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.పెద్ద పెద్ద దేశాధినేతలు వచ్చినప్పుడు కల్పించే భద్రత ఉండేలా ఉన్నట్లు అతడికి సెక్యూరిటీని ఏర్పాటు చేయడం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు అమెరికా పోలీసులు.

తాను బస చేసిన హోటల్ నుంచి మైదానంకు చేరుకునే సమయంలో విరాట్ కోహ్లీకి కల్పించడం భద్రతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో గమనించినట్లయితే.కోహ్లీ చుట్టూ అనేకమంది భద్రత దళాలు చుటుముట్టాయి.వారి పక్కనే గుర్రాలపై కూడా భద్రతా సిబ్బంది ఉందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

అంత భద్రత నడుమ హోటల్ నుంచి కోహ్లీ గ్రౌండ్ కి వెళ్ళాడు.ఈ సమయంలో కోహ్లీతోపాటు టీమిండియా డాషింగ్ బ్యాట్స్మెన్ రింకు సింగ్ కూడా అందులో ఉన్నాడు.

ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ ‘కింగ్‘ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ కామెంట్ చేస్తుండగా.మరికొందరైతే ఏదో కల్పిస్తున్నానంటే కల్పించాలి మాత్రం కాకుండా భద్రత అంటే ఇలా ఉండాలి అని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube