కార్తీకమాసం అనగానే ప్రతి రోజు స్నానాలు,పూజలు,ఉపవాసాలు గుర్తుకు వస్తాయి.ఈ నెల మొత్తం పూజలు భక్తి శ్రద్దలతో చేస్తే చాలా పుణ్యం వస్తుంది.
దాంతో అందరు మానకుండా ఈ నెలలో పూజలు,తల స్నానాలు,ఉపవాసాలు చేసేస్తూ ఉంటారు.అయితే తల స్నానం సూర్యోదయానికి ముందే లేచి చన్నీళ్లతో తల స్నానము చేయాలి.
అంతేకాక తల స్నానం చేసే ముందు తలకు నూనె రాయకూడదు.ఆలా రాస్తే మంచిది కాదు.
ఈ మాసంలో అబద్దాలు ఆడటం, ఎదుటివారిని బాధ పెట్టడం, మోసాలు ఇలాంటివి అస్సలు చేయకూడదు.ఇలాంటివి ఏ మాసంలో అయినా చేయకూడదు.
కార్తీకమాసంలో అస్సలు చేయకూడదు.కార్తీకమాసంలో దీపం వెలిగించడం ఎంతో పుణ్యమైనా పని.అయితే ఆ దీపంలో ఒక వత్తు వేయకూడదు.దీపంలో 2 వత్తులను వేసి మాత్రమే వెలిగించాలి.
అంతేకాక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కార్తీక మాసంలో మధ్యాహ్న సమయంలో అసలు పడుకోకూడదు.ఎందుకంటే ఈ మాసం శివకేశవులు ఇద్దరికీ చాలా ఇష్టమైన మాసం.
అలా గాని పడుకుంటే శివకేశవులకు కోపం వస్తుందంట.ఈ మాసంలో మద్యాహ్నం గాని పడుకుంటే తీరని కష్టాలు వస్తాయని అంటారు.
కాబట్టి సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో నిద్ర పోకుండా చూసుకోండి.