జపం చేయాలనుకున్న వారు ముందుగా గురువు ఉపదేశం పొందాలి. గురూపదేశం లేకుండా చేసే జపం అంత మంచిది కాదు.
అలాగే జప మాలలోని పూసలు కచ్చితంగా 108 ఉండేలా చూస్కోవాలి.జపమాల రెండు చివరలను కలిపే పూసను సుమేరు పూస అంటారు.
జపం చేసేటప్పుడు మాల కనిపించకుండా పైన ఖ శుభ్రమైన వస్త్రాన్ని కప్పి ఉంచడం మంచిది.అలాగే జపం చేయాలకునే వాళ్లు కొన్ని నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలి.
అయితే అవేంటి.అలాగే జప సమయంలో మనుషులు ఎలా ఉండాలి, ఎలా వస్త్రాలు ధరించాలి, ముఖ్యంగా ఏ రంగు బట్టలు ధరించాలి వంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జప సమయంలో కొత్త దుస్తులు వాడటం మంచిది.అందులోనూ ఉతికినవి.చాలా శుభ్రంగా ఉన్న బట్టలు ధరించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.అంతే కాదండోయ్ శీతా కాలములో మనుషులు వాతము, కఫము హరించే, పట్టు, ఉన్ని గుల బట్టలు ధరించాలి.
కాషాయ వస్త్రము మేధస్సుకు హితకారి.కాబట్టి రుపు రంగు దుస్తులను అన్ని వేళలా… అంటే అన్ని రుతువుల్లో ధరించ వచ్చని మన పురాణాలు చెబుతున్నాయి.
తెల్లని వస్త్రాలు సుఖ కరము, శీలము వేడిని నిరోధిస్తాయి.అందు వలన ఎక్కువ వేడి, ఎక్కువ చల్లదనము కలుగదు.
తెలుపు దుస్తులు ధరించుట వలన హుందాతంతో పాటు సౌఖ్యము కల్గును.అందుచేత పూజా సమయములో తెలుపు లేదా కాషాయ రంగు లేదా బంతిపువ్వు రంగు (పసుపు పచ్చ) బట్టలు ధరించడం మంచిది.