చాలా మందికి కొన్ని కోరికలు ఉంటాయి.అయితే చిన్నప్పటి నుంచే మన మదిలో కొన్ని లక్ష్యాలు ఉన్నప్పటికీ… పలు కారణాల వాటిని నెరవేర్చుకోలేకపోతుంటాం.అయితే చనిపోయేలోపు అయినా సరే ఆ కోరికలను తీర్చుకోవాలనకుుంటాం.అందుకోసం వయసుతో సంబంధం లేకుండా కష్టపడతాం.వయసు మీరిన తర్వాత కూడా అలా అనుకొని చదువుకున్న వాళ్లు.తమకు నచ్చిన రంగాల్లో రికార్డులు సృష్టించిన వారు కోకొల్లలు.
అయితే తాజాగా ఓ ఏడుపదులు వయసున్న బామ్మ కూడా ఇలాగే చేసింది.యువకులు చేస్తున్న విన్యాసాలను చూసి… ఆమె కూడా అందులో భాగం అయింది.
ఏఎవరూ ఉహించని రీతిలో విన్యాసాలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
హరియాణాకు చెందిన ఈ బామ్మ… ఉత్తరాఖండ్ హరిద్వార్ లోని హర్ కీ పౌడీ ఘాట్ వంతెనపై నుంచి గంగా నదిలో దూకి.
సునాయసంగా ఒడ్డుకు చేరుకుంది.ఈ సమయంలో వంతెన పైనుంచి నదలో దూకుతున్న యువకులను చూసి ఉత్సాహంతోనే ఆమె ఇలా చేసిందని కుటుంబ సభ్యులు తెలిపారు.అయితే ఆమెకు చిన్నప్పటి నుంచి డైవ్, స్విమ్మింగ్ చేయడం ఇష్టమని వారు వివరించారు.
అందుకే ఈ వయసులోని ఆమె సునాయసంగా ఇలాంటి అద్భుతం సృష్టించిందని పేర్కొన్నారు.అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఏడు పదుల వయసులోనూ బామ్మ చేసిన ఈ విన్యాసాలు చూడ ముచ్చటగా ఉన్నాయంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఏజే లోనే ఇన్ని సాహసాలు చేస్తున్న ఈమె… వయసులో ఉన్నప్పుడు ఇంకా ఎన్నెన్ని విన్యాసాలు చేసిందో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.