బన్నీ సలహా వల్లే తండేల్ సినిమా హిట్ గా నిలిచిందా.. అసలేం జరిగిందంటే?

చందు మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి, నాగచైతన్య (Sai Pallavi, Naga Chaitanya)కలిసి నటించిన తండేల్ (thandel)సినిమా తాజాగా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.

 Allu Arjun Refer Devi Sri Prasad For Thandel Movie, Allu Arjun, Devi Sri Prasad,-TeluguStop.com

ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.రోజు రోజుకి ఈ సినిమా కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి.

సాయి పల్లవి నాగచైతన్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయింది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్ లకు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రస్తుతం థియేటర్ బయట హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

అయితే సినిమాలో సంగీతం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది అన్న విషయం తెలిసిందే.కానీ దేవిశ్రీ సంగీతం(Music by Devishri) ప‌క్క‌న పెట్టి చూస్తే తండేల్‌ బిలో యావ‌రేజ్ స్థాయిలోనే ఆగిపోయేదట.

ఈ క్రెడిట్ లో కొంత అల్లు అర్జున్‌ కు చెందుతుంది.ఎందుకంటే తండేల్‌ సినిమాకు దేవిశ్రీ ప్ర‌సాద్ ని తీసుకోవాల‌నుకొన్న‌ప్పుడు అల్లు అర‌వింద్ (Allu Aravind)కాస్త సందేహ‌ప‌డ్డారట.

అప్ప‌టికే పుష్ప 2(Pushpa 2 ) సినిమాతో దేవిశ్రీ ప్ర‌సాద్ చాలా బిజీ.అంత బిజీలో తండేల్ సినిమాకు టైమ్ కేటాయించ‌గ‌ల‌డా, లేదా? అనేది అర‌వింద్ అనుమాన పడ్డారట.దాంతో వేరే సంగీత ద‌ర్శ‌కుడ్ని ఎంచుకోవాల‌న్న ఆలోచ‌న కూడా వ‌చ్చిందట.

Telugu Allu Aravind, Allu Arjun, Devi Sri Prasad, Naga Chaitanya, Pushpa, Thande

కానీ బ‌న్నీ మాత్రం ల‌వ్ స్టోరీ అంటే దేవిశ్రీ ప్ర‌సాద్ ఉండాల్సిందే అని అల్లు అర‌వింద్ కు స‌ర్ది చెప్పారట.అది బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది.అల్లు అర్జున్ చెప్పినట్టుగానే ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం బాగా వర్క్ అవుట్ అయింది.

దేవి శ్రీ ప్రసాద్ లేకపోతే ఈ సినిమా మరోలా ఉండేదేమో అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి ఈ క్రెడిట్ లో కొంచెం బన్నీకి కూడా చోటు దక్కిందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube