తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో కమెడియన్ సునీల్ (Sunil)గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు సునీల్.
ఇకపోతే సునీల్ ఇటీవల కాలంలో కేవలం కమిటీ అనగా మాత్రమే కాకుండా విలన్ క్యారెక్టర్లలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.సునీల్ విలన్ గా నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప 2.అల్లు అర్జున్ (Pushpa 2, Allu Arjun)హీరోగా నటించిన ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులలో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు సునీల్.ఇది ఇలా ఉంటే తాజాగా పుష్ప టు సినిమా థ్యాంక్స్ మీట్ లో పాల్గొన్న సునీల్ ఈ సందర్భంగా తనకు స్పెయిన్ లో ఎదురైనా ఒక సంఘటనను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా సునీల్(sunil) మాట్లాడుతూ.పుష్ప(Pushpa) వైబ్రేషన్స్ కొనసాగుతూనే ఉంటాయని పార్ట్ 1 సమయంలోనే చెప్పాను.అదే నిజమైంది.షూట్ కోసం ఇటీవల స్పెయిన్ వెళ్లాను.రాత్రి 10 గంటలకు అక్కడ రెస్టారెంట్ లు మూసి వేస్తారు.9.45 గంటల సమయంలో ఒక పెట్రోల్ బంక్ కు వెళ్లి స్నాక్స్ కోసం అక్కడే ఉన్న స్టోర్‌లో అడిగాను.ఫుడ్ లేకపోయినా ఆ రోజు ఏదో ఒక రకంగా సర్దుకుపోదామనుకున్నాను.
అది క్లోజ్ అయిందని అక్కడే ఉన్న లేడీ చెప్పింది.ఆ తర్వాత దగ్గర్లో రెస్టారెంట్ లు ఏమైనా ఉన్నాయా అని సెర్చ్ చేశాను.
కబాబ్ పాయింట్ అనే ఒక చిన్న హోటల్ కనిపించింది.ఇండియన్ ఫుడ్ (Indian food)ఉండవచ్చని అక్కడి వెళ్లాము.
అప్పటికే అర్ధరాత్రి రెండున్నర అయింది.మేము కారు దిగగానే ఒక వ్యక్తి నన్నే తదేకంగా చూస్తూ ఉన్నాడు.
వెంటనే తన ఫోన్ లో పుష్ప ఇంటర్వెల్ సీన్ చూపించి, ఇది నువ్వే కదా అన్నా అని అడిగాడు.

ఆ తర్వాత తెలిసింది అది పాకిస్థానీయుల రెస్టారెంట్ అని.నాతో పాటు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ లో ఉన్న సభ్యులందరికీ వారు వంట చేసి పెట్టారు.ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో వీడియో కాల్ లో మాట్లాడాను.
మా సినిమా ఎంతోమందికి చేరిందనడానికి ఇదొక ఉదాహరణ.ఎక్కడికి వెళ్లినా నన్ను చూస్తే అందరికీ పుష్ప గుర్తుకు వస్తుంది.
హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో సినిమాల్లో విలన్ గా చేయాలని దిల్ సుఖ్ నగర్ (Dilsukhnagar)లో ఫొటోలు దిగి ఎంతోమందిని కలిశాను.కమెడియన్ గా గుర్తింపు వచ్చిన నన్ను విలన్ గా తీసుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి.
ఒక వ్యక్తి బతికి ఉండగానే పునర్జన్మ ఇవ్వడం కష్టం.అది ఎవరి వల్లా కాదు.
ఇప్పుడు తమిళం, కన్నడ, మలయాళంలో(Tamil, Kannada, Malayalam) మంచి పాత్రలు ఇస్తున్నారు.నువ్వు ఇచ్చిన పునర్జన్మ వాళ్లు కూడా కంటిన్యూ చేస్తున్నారు.
థాంక్స్.షూట్ ఫస్ట్‌డే నాకెంతో కంగారుగా అనిపించింది.
భాష విషయంలో అల్లు అర్జున్ నాకెంతో సాయం చేశారు.ఆ భగవంతుడే వచ్చి ఇక కష్టపడొద్దు అని చెప్పేంత కష్టపడతారు.
మనం శ్రమిస్తే విజయం దానంతట అదే వరిస్తుంది.మీరు ఆ కష్టాన్ని నమ్ముకున్నారు.
మీ కష్టానికి ఆ దేవుడు ఎప్పుడూ న్యాయం చేయాలని కోరుకుంటున్నా.నేనేక లోకల్ ప్రొడక్ట్.
దానికి ఒక ముద్ర వేసి ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ చేశారు అని చెప్పుకొచ్చారు సునీల్.








