ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.46సూర్యాస్తమయం:సాయంత్రం.6.16రాహుకాలం: ఉ.7.30 ల9.00అమృత ఘడియలు: ఉ.5.48 ల6.24 సా7.00 ల7.24దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34
మేషం:

ఈరోజు రావలసిన ధనం చేతికి అందుతుంది.కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.నూతన వస్తు వాహనం కొనుగోలు చేస్తారు.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
వృషభం:

ఈరోజు చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది.వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.కీలక వ్యవహారాలలో కుటుంబ మాట పట్టింపులు ఉంటాయి.నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి.ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.
మిథునం:

ఈరోజు సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.
ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
కర్కాటకం:

ఈరోజు వ్యాపారాలు మరింత మందగిస్తాయి.ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది.వృధా ఖర్చులు పెరుగుతాయి.ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.
సింహం:

ఈరోజు నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి.కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి.ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు.వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.
కన్య:

ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది.సన్నిహితులతో దైవదర్శనాలు చేసుకుంటారు.
కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
తుల:

ఈరోజు విద్యార్థులకు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.దైవ చింతన పెరుగుతుంది.
వృశ్చికం:

ఈరోజు మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.వ్యాపార, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలుంటాయి.కొన్ని పనులలో శ్రమ తప్పదు.ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు తప్పవు ఇంటాబయట ఊహించని వివాదాలు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
ధనుస్సు:

ఈరోజు ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.
నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.ఉద్యోగ వాతవరణం ఉత్సాహంగా ఉంటుంది.
మకరం:

ఈరోజు దైవ చింతన పెరుగుతుంది.కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది.ఉద్యోగమున కొందరి ప్రవర్తన వలన శిరో బాధలు కలుగుతాయి.కొన్ని పనుల్లో ఆటంకాలు తప్పవు.ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చేస్తారు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
కుంభం:

ఈరోజు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు.బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి.ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.
మీనం:

ఈరోజు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.ఆర్థిక అనుకూలత కలుగుతుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు.విలువైన వస్తు వాహన లాభాలు అందుకుంటారు.







