భారతీయ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్( MMA ) ఫైటర్ అన్షుల్ జూబ్లీకి( Anshul Jubli ) UFC 312 పీడకలగా మిగిలిపోయింది.కేవలం 19 సెకన్లలోనే అతని పోరాటం ముగిసింది.
ఆస్ట్రేలియా ఫైటర్ క్విల్లన్ సాల్కిల్డ్( Quillan Salkilld ) ఒక్క పంచ్‌తో అన్షుల్‌ని కుప్పకూల్చాడు.లైట్ వెయిట్ బౌట్‌గా జరిగిన ఈ మ్యాచ్ క్వూడోస్ బ్యాంక్ ఎరీనాలో జరిగింది.
అన్షుల్ నేలకూలగానే రిఫరీ వెంటనే ఫైట్ ను ఆపేశాడు.కానీ జూబ్లీ వెంటనే తేరుకుని సాల్కిల్డ్ కాలు పట్టుకుని పోరాటం ఆపొద్దంటూ సైగలు చేశాడు.తాను స్పృహలోనే ఉన్నానని చెప్పే ప్రయత్నం చేశాడు.దీంతో చాలా మంది రిఫరీ తొందరపడ్డాడని, పోరాటం కొనసాగించాల్సిందని వాదిస్తున్నారు.
అయితే అన్షుల్ పడిన విధానం చూస్తే ఎవరైనా ఔట్ అయ్యాడనే అనుకుంటారని, రిఫరీ నిర్ణయం సరైనదేనని కొందరు అంటున్నారు.

రోడ్ టు UFC సీజన్ 1 గెలిచి అన్షుల్ UFC కాంట్రాక్ట్ కొట్టాడు.ప్రపంచంలోనే టాప్ MMA ప్రమోషన్‌లో తన తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు.కానీ సొంతగడ్డపై ఆడుతున్న సాల్కిల్డ్ ముందు అన్షుల్ ఒక్క రౌండ్ కూడా నిలబడలేకపోయాడు.
అన్షుల్ కోలుకునే సంకేతాలు చూపించడంతో ఫైట్ కొనసాగించాల్సిందని కొందరు అభిమానులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.పంచ్ గట్టిగా తగలడంతో అన్షుల్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడని, అందుకే రిఫరీ సరైన నిర్ణయం తీసుకున్నాడని మరికొందరు వాదిస్తున్నారు.

ఇది అన్షుల్‌కు UFCలో రెండో ఓటమి.దాదాపు 470 రోజుల తర్వాత అతను బరిలోకి దిగాడు.భారీ అంచనాలతో బరిలోకి దిగినా, వాటిని అందుకోలేకపోయాడు.అన్షుల్ తన UFC డెబ్యూలో మాత్రం అదరగొట్టాడు.తొలి రౌండ్లలో అద్భుత ప్రదర్శన చేశాడు.కానీ మూడో రౌండ్లో ప్రత్యర్థి ఒత్తిడి పెంచడంతో తడబడ్డాడు.
UFC 312 ఫైట్ కు ముందు అన్షుల్ పెద్ద సంఖ్యలో ప్రేక్షకుల ముందు పోరాడటం గురించి మాట్లాడాడు.తన తొలి పోరులో 50,000 మంది ప్రేక్షకుల సందడి చూసి తొలుత కొంచెం భయపడ్డానని చెప్పాడు.
కానీ ఈసారి మాత్రం పూర్తి దృష్టి పెట్టి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.కానీ దురదృష్టవశాత్తు, అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి.







