అల్లం. దీని గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు.
ఘాటైన రుచి, వాసన కలిగి ఉండే అల్లంలో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్సరస్, జింక్, ఐరన్, ఫొలేట్, నియాసిన్, విటమిస్ సి, విటమిన్ బి, శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా అల్లం అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
అయితే ప్రస్తుతం వేసవి కాలం వచ్చింది.ఈ సీజన్‌లో శరీరానికి వేడి చేస్తుందనే కారణంతో అల్లాన్ని ఎవైడ్ చేస్తుంటారు.
కొందరు మాత్రం అవేమి పట్టించుకోకుండా ఎప్పటిలాగేనే అల్లాన్ని తీసుకుంటారు.అసలు వేసవిలో అల్లాన్ని తీసుకోవచ్చా.? తీసుకోకూడదా.? అంటే.తీసుకోమనే చెబుతున్నారు నిపుణులు.వేసవిలో చాలా మంది జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు.వాటికి అడ్డు కట్ట వేయడంలో అల్లం అద్భుతంగా సహాయపడుతుంది.రోజూ ఉదయాన్నే అల్లం వాటర్‌ను తీసుకుంటే జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.
ఫలితంగా గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలన్నీ పరార్ అవుతాయి.

అలాగే వేసవి వేడి వల్ల ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు తరచూ వేధిస్తూనే ఉంటాయి.అయితే అలాంటి సమయంంలో ఒక కప్పు అల్లం టీని తీసుకుంటే గనుక.ఒత్తిడి, తలనొప్పి వంటి వాటి నుంచి క్షణాల్లో ఉపశమనం పొందొచ్చు.
అంతే కాదు, అల్లంను తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గు ముఖం పడుతుంది.వెయిట్ లాస్ అవుతారు.కీళ్ల నొప్పులు దూరం అవుతాయి.బ్లెడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.
అయితే మంచిదన్నారు కదా అని అల్లాన్ని ఓవర్‌గా తీసుకుంటే మాత్రం రిస్క్‌లో పడ్డట్టే.అధిక మొత్తంలో తీసుకుంటే లేనిపోని సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
వాస్తవానికి వేసవి కాలంలో అల్లాన్ని రోజుకు నాలుగు గ్రాములకు మించి తీసుకోరాదని నిపుణులు చెబుతున్నారు.







