సాధారణంగా చిరుతపులులు చాలా అగ్రెసివ్ గా ఉంటాయి.అయితే తాజాగా ఒక పెద్దపులి మాత్రం చిన్న పిల్లాడి లాగా ఒక నీటి తొట్టెలో కేరింతలు కొడుతూ ఆడుకుంది.
దీనికి సంబంధించిన వీడియోని @thedodo అనే ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే దాదాపు 5 లక్షల వ్యూస్ వచ్చాయి.
మూడు నిమిషాలకు పైగా నిడివి గల ఈ వీడియోని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక పెద్దపులి నీటిలోకి దిగడం చూడొచ్చు.
ఆ తర్వాత అది అందులో పడుకుంది.అలాగే అందులో ఉన్న ఒక కర్ర తో ఆడుకుంటూ కేరింతలు కొట్టింది.
ఇది చాలా సేపు వాటర్ టాయ్స్ తో చాలా ఎంజాయ్ చేసింది.ఒక వైల్డ్ క్యాట్స్ శాంక్చురీ ఈ పెద్దపులిని ఒక ప్రమాదకరమైన ప్లేస్ నుంచి రక్షించింది.
ఆ తర్వాత ఈ పులి హాయిగా తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.మొదట్లో ఇది చాలా బరువు తక్కువగా ఉండేది.
దీనిని కేవలం పిల్లలు పుట్టించడానికి మాత్రమే పులి పిల్లలు అమ్మే విక్రేతలు వాడుకునేవారు.
దీనికి కనీస అవసరాలు కూడా తీర్చకుండా చాలా ఘోరంగా ట్రీట్ చేసేవారు.
రెస్క్యూ చేసిన టైం లో ఈ పులి శరీరంపై కొన్ని గాయాలు ఉండేవి.అయితే ఇప్పుడు వాటన్నిటినీ నయం చేసి చక్కటి ఆహారం అందిస్తూ దీన్ని పుష్టిగా పెంచుతున్నారు.
ఈ పులికి మార్కస్ అనే పేరు కూడా పెట్టారు.ఈ రెస్క్యూ టీం రక్షించిన టైగర్స్ లో మార్కస్ అంత హ్యాపీగా ఏ పులి లేదట.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.మార్కస్ ని కాపాడిన రెస్క్యూ టీం కి ధన్యవాదాలు తెలుపుతున్నారు.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.