తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది… ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ప్రస్తుతం ఆయన సుజిత్( Sujith ) డైరెక్షన్ లో చేస్తున్న ఓ జి సినిమా సెట్స్ మీద ఉన్న విషయం మనకు తెలిసిందే.

మరి ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యం లో పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఈ సినిమా కూడా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది.కాబట్టి ప్రతి ఒక్కరిని అలరిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక సుజిత్ లాంటి యంగ్ డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకు సాగుతున్నాడు.
తొందరలోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమా మీద తన డేట్స్ ని కేటాయించి సినిమా మొత్తాన్ని ఫినిష్ చేసి విడుదల చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నారు.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది.
కానీ ఓజీ సినిమా( OG movie ) కోసం ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ సినిమా కోసం దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను పవన్ కళ్యాణ్ తీసుకున్నాడట.కారణం ఏదైనా కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతుందనే ఉద్దేశ్యంతోనే ప్రొడ్యూసర్ డివివి దానయ్య పవన్ కళ్యాణ్ కి అంత మొత్తంలో చెల్లించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో చేస్తున్న ఈ సినిమా వెయ్యి కోట్ల వరకు కలెక్షన్లను రాబడుతుందనే అంచనాలైతే ఉన్నాయి…
.







