బిహార్‌లో ( Bihar )వెలుగులోకి వచ్చిన ఈ వింత కక్ష సాధింపు స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అసలు మ్యాటర్ ఏంటంటే.
ఒక మొగుడు తన పెళ్ళాం మీద పగ తీర్చుకోవడానికి చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు.భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం కామన్.
కానీ ఈ జంట మధ్య గొడవలు మాత్రం వెరైటీగా ఉన్నాయి.గొడవలు ముదిరి పాకాన పడటంతో భార్య పుట్టింటికి పోయింది.
ఇక విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది.
అయితే భర్త మాత్రం కక్ష పెంచుకున్నడు.
పెళ్ళాం మీద పగ తీర్చుకోవడానికి ట్రాఫిక్ రూల్స్‌ను( Traffic rules ) బ్రేక్ చేయడం స్టార్ట్ చేసిండు.అది కూడా తన భార్య పేరు మీద రిజిస్టర్ అయిన బైక్‌పైనే తిరుగుతూ కావాలని ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్నడు.
దీంతో ట్రాఫిక్ పోలీసులు విధించే ఫైన్ల మెసేజ్‌లు నేరుగా భార్య ఫోన్‌కు పోతున్నాయి.మొదట్లో ఆమె కొన్ని ఫైన్లు కట్టింది కూడా.
కానీ ఫైన్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక పోలీసులను ఆశ్రయించింది పాపం.

ఇంతకీ అసలు స్టోరీ ఏంటంటే.ముజఫర్‌పూర్‌లోని కాజీ మహ్మద్‌పూర్ ఏరియాకు( Kazi Mohammadpur area of Muzaffarpur ) చెందిన ఒక అమ్మాయికి గతేడాది పాట్నాకు చెందిన అబ్బాయితో పెండ్లి అయింది.పెండ్లి టైంలో కట్నంగా అమ్మాయి తండ్రి బైక్ గిఫ్ట్‌గా ఇచ్చిండు.
కానీ ఆ బైక్ మాత్రం కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిండు.పెండ్లైన నెలన్నరకే భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యినాయి.
దీంతో విసిగిపోయిన భార్య మొగుడింటిని వదిలి పుట్టింటికి పోయింది.ఆ తర్వాత ఇద్దరూ విడాకుల కోసం కోర్టును కూడా ఎక్కిన్రు.
ఇక అప్పటినుంచి మొగుడు స్టార్ట్ చేసిండు అసలు ఆట.

గడచిన మూడు నెలల్లో ట్రాఫిక్ పోలీసులు ఏకంగా నాలుగు చలాన్లు పంపిన్రు ఆమెకు.మొదట్లో ఆమె సైలెంట్‌గా ఆ ఫైన్లు కట్టింది.కానీ రోజురోజుకు ఫైన్లు ఎక్కువ కావడంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది.
ఇక లాభం లేదని డైరెక్టుగా మొగుడికి ఫోన్ చేసి బైక్ తిరిగి ఇవ్వమని అడిగింది.కానీ మొగుడు మాత్రం విడాకులు అయిపోయేదాకా బైక్ ఇవ్వనని తెగేసి చెప్పిండు.
బాధితురాలు విసిగిపోయి పాట్నా ట్రాఫిక్ పోలీసులకు కంప్లైంట్ చేసింది.వాళ్లు మాత్రం మీ లోకల్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పిన్రు.
దీంతో ఆమె కాజీ మహ్మద్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తండ్రితో కలిసి వెళ్లి కంప్లైంట్ చేసింది.పోలీసులు మాత్రం ఆమెను ఒకటే క్వశ్చన్ అడిగిన్రు.“బైక్ మీ దగ్గరే ఉందని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు?” అని.దీంతో పోలీసులు ఆమెకు ఒక సలహా ఇచ్చారు.అఫిడవిట్ సబ్మిట్ చేయమని చెప్పారు.మీ ఆయననే వెహికిల్ వాడుతున్నట్లు అఫిడవిట్‌లో రాయమని చెప్పిన్రు.అది ఉంటే ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి ఈజీ అవుతుందని పోలీసులు చెప్పిన్రు.మొత్తానికి పెళ్ళాం మీద కక్ష తీర్చుకోవడానికి మస్తు వెరైటీ ప్లాన్ వేశాడు కానీ.
పోలీసులు మాత్రం సీరియస్‌గా తీసుకున్నారు.వాడి దూల తీర్చేందుకు రెడీ అయినట్టు ఉన్నారు.







