కొబ్బరి నూనె, కర్పూరంతో క‌లిపి రాస్తే..ఆ చ‌ర్మ స‌మ‌స్య‌లు దూరం!

కొబ్బరి నూనె, కర్పూరం.ఈ రెండిటి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

 Benefits Of Mix Camphor With Coconut Oil! Benefits Of Mix Camphor, Coconut Oil,-TeluguStop.com

ఈ రెండూ అంద‌రి ఇళ్ల‌ల్లోనూ ఉండేవే.వీటిని విరి విరిగా కూడా ఉప‌యోగిస్తుంటారు.

క‌ర్పూరాన్ని దేవుడికి హారతి ఇవ్వటానికి, దిష్టి తియ్యటానికి ఉప‌యోగిస్తే.కొబ్బ‌రి నూనెను త‌ల‌కు, ఒంటికి ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు.

ఈ రెండూ విడి విడిగా ఎలా ఉప‌యోగించాలి, ఎందుకు ఉప‌యోగించాలి అన్న విష‌యాలుకు మ‌న‌కు బాగా తెలుసు.అయితే ఈ రెండిటినీ క‌లిపి యూజ్ చేస్తే.

ఎన్నో చ‌ర్మ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌న్న విష‌యం మాత్రం చాలా మంది తెలుయ‌దు.

నిజానికి క‌ర్పూరం, కొబ్బ‌రి నూనె క‌లిపి వాడ‌టం వ‌ల్ల అనేక చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను నివారించుకోవ‌చ్చు.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.నేటి కాలంలో యువ‌త‌ను ఎక్కువ‌గా వేధించే స‌మ‌స్య మొటిమ‌లు.

వీటిని త‌గ్గించుకునేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం ఉండ‌దు.అయితే కొద్దిగా కొబ్బ‌రి నూనె తీసుకుని.

అందులో కర్పూరం వేసి కరిగించాలి.ఈ మిశ్ర‌మాన్ని రాత్రి నిద్రించే ముందు మొటిమ‌ల‌పై పెట్టి.

ఉద‌యాన్నే చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు లేదా మూడు రోజులు క్ర‌మంగా చేస్తే మొటిమ‌లు సుల‌భంగా త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

Telugu Tips, Benefitscoconut, Benefitsmix, Coconut Oil, Latest, Mixcamphor, Skin

అలాగే దద్దుర్లు, ఎల‌ర్జీ వంటి స‌మ‌స్య‌తో ఇబ్బందులు ప‌డుతున్న‌ వారు క‌ర్పూరాన్ని కొబ్బ‌రి నూనెలో క‌ర‌గ‌బెట్టి..స‌మ‌స్య ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి.ఒక అర గంట పాటు ఆరనిచ్చి.

ఆ త‌ర్వాత కోల్డ్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల క్ర‌మంగా ద‌ద్దుర్లు, ఎల‌ర్జీలు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

ఇక చుండ్రు స‌మ‌స్య‌ను నివారించ‌డంలోనూ ఈ రెండిటి కాంబినేష‌న్ ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.ముందుగా కొబ్బ‌రి నూనెను లైట్‌గా వేడి చేసి.అందులో క‌ర్పూరాన్ని క‌రిగించాలి.ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు బాగా ప‌ట్టించి గంట త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే క్ర‌మంగా చుండ్రు స‌మ‌స్య త‌గ్గుముఖం ప‌డుతుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube