టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం అయిన హీరోలలో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ఒకరు.గత కొన్నేళ్లుగా ఈ హీరోకు సరైన సక్సెస్ లేదు.
విజయ్ దేవరకొండ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గీతా గోవిందం కాగా ఆ సినిమా కలెక్షన్ల రికార్డులను మరే సినిమా బ్రేక్ చేయలేదు.డియర్ కామ్రేడ్, లైగర్, ఫ్యామిలీ స్టార్( Dear Comrade, Liger, Family Star ) సినిమాలు విజయ్ దేవరకొండ మార్కెట్ ను తగ్గించాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
అయితే విజయ్ దేవరకొండ కొత్త సినిమాపై మాత్రం భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.విజయ్ దేవరకొండ కొత్త సినిమా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కనుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
త్వరలో ఈ సినిమా టీజర్ రిలీజ్ కానుండగా ఈ టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నారని సమాచారం అందుతోంది.సితార నిర్మాతలతో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కు మంచి అనుబంధం ఉంది.

అందువల్ల ఈ టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా 7 విజయాలతో ఎన్టీఆర్ టాప్ లో ఉన్నారు.దేవర సిక్వెల్ సైతం ఈ ఏడాదే మొదలుకానుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.యంగ్ టైగర్ ఎన్టీఆర్ హవా బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 80 కోట్ల రూపాయల ( 80 crore rupees )నుంచి 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 సినిమాతో బిజీగా ఉన్నార్.బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తారక్ కెరీర్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ తర్వాత సినిమాతో బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తారో చూడాల్సి ఉంది.







