సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది.గాల్లో విమానం నుంచి దూకేసిన స్కైడైవర్‌కు ఒక్కసారిగా మూర్ఛలు వచ్చాయి.
అంతే, కంట్రోల్ తప్పిపోయాడు.బాడీ మొత్తం తిరగబడి, వణుకుతూ అదుపు లేకుండా పడిపోతున్నాడు.
అయితే పక్కనే ఉన్న మరో స్కైడైవర్ మెరుపు వేగంతో రియాక్ట్ అయ్యాడు.వెంటనే అతన్ని పట్టుకుని, కిందకు పడకుండా స్టెడీ చేశాడు.
ఆపై అతడి పారాచూట్‌ను ఓపెన్ చేశాడు.ఆ ధైర్యవంతుడు క్షణాల్లో స్పందించడంతో, స్పృహ కోల్పోయిన ఆ స్కైడైవర్ క్షేమంగా కిందకు దిగాడు.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలీదు కానీ, ఇది ఒక ఫారిన్ కంట్రీలో జరిగి ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం నెట్టింట బాగా వైరల్ అవుతోంది.రక్షించిన స్కైడైవర్ ధైర్యానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.“నిజమైన సూపర్ మ్యాన్ అంటే ఇతనే” అని ఒకరు కామెంట్ చేస్తే, “అందరూ హీరోలు క్యాప్ వేసుకోరు” అని మరొకరు పొగిడారు.
మరికొంతమంది నెటిజన్లు ఈ వీడియో చూసి షాక్ అయ్యారు.“అతను గాల్లో అలా ఫిట్స్ వచ్చి కొట్టుకుంటుంటే మా గుండె ఆగిపోయినంత పనైంది” అని కామెంట్ చేశారు.ఇలాంటి వీడియోలు పెట్టేటప్పుడు “గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడండి” అని ఒక వార్నింగ్ లేబుల్ ఇస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు.నిజమే, ఆ వీడియో చూస్తుంటే భయంతో గుండె దడదడలాడుతుంది.
అంత టెర్రిఫిక్ గా ఉంది మరి.

ఇదిలా ఉంటే, మరోవైపు పారాగ్లైడింగ్ ప్రమాదాలు ( paragliding )మళ్లీ విషాదం నింపాయి.ధర్మశాల( Dharamshala ) దగ్గర 19 ఏళ్ల టూరిస్ట్ పారాగ్లైడింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయింది.గుజరాత్‌కు చెందిన భవ్సర్ ఖుషి అనే అమ్మాయి ఇంద్రునాగ్ పారాగ్లైడింగ్ సైట్‌లో టెండమ్ ఫ్లైట్ (ఇద్దరు కలిసి ఎగిరేది) చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
టేకాఫ్ తీసుకుంటుండగానే పైలట్‌తో సహా కిందపడిపోయింది.వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా చనిపోయింది.పైలట్‌కు కూడా గాయాలయ్యాయి.

ఇది జరిగి కొన్ని రోజులకే కులులో మరో ప్రమాదం జరిగింది.ఇద్దరు పారాగ్లైడర్లు గాల్లో ఢీకొనడంతో తమిళనాడుకు చెందిన టూరిస్ట్ చనిపోయాడు.జనవరిలో కూడా మనాలిలో పారాగ్లైడింగ్ క్రాష్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టూరిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు.
ఇలాంటివి జరగకుండా ఉండాలంటే అడ్వెంచర్ చేసేవాళ్లు సేఫ్టీ రూల్స్ తప్పకుండా పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.







