నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) తాజాగా డాకు మహారాజ్ ( Daku Maharaj )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఇలా బాలకృష్ణ ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు.ఈయన అఖండ సినిమా నుంచి మొదలుకొని వీర నరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
బాలకృష్ణ అఖండ 2( Akhanda 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు కూడా ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది.బోయపాటి ( Boyapati )బాలకృష్ణ కాంబినేషన్ అంటే వెండితెరపై మరో బ్లాక్ బస్టర్ కాయమనే చెప్పాలి ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ సొంతం చేసుకున్నాయి.ఇక అఖండ 2 పై కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా బోయపాటి శ్రీను ఈ సినిమా విషయంలో తన హిట్ సెంటిమెంట్ రిపీట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

బాలకృష్ణ ఆఖండ సినిమా తర్వాత బోయపాటి స్కంద సినిమా చేశారు కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అయితే గతంలో ఈయన అల్లు అర్జున్ తో కలిసి సరైనోడు సినిమా చేశారు.ఈ సినిమాలో విలన్ పాత్రలో యంగ్ హీరో ఆది పినిశెట్టి ( Aadi Pinisetty )నటించారు.ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది.
ఈ క్రమంలోనే ఆది పినిశెట్టిని అఖండ 2 లో విలన్ గా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తుంది.ఇక ఆఖండ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో సీక్వెల్ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.







