గిదేంది గిల్లంత వెరైటీ.. యూకేలో మనుషుల బూడిదని కమ్యూనిటీ గార్డెన్లలో చల్లుతున్నారట!

యూకేలో పూలమొక్కల్లో మనుషుల బూడిద చల్లడం ఏంటి విడ్డూరం కాకపోతే అని అనుకుంటున్నారా.నిజమండీ.

 Gidendi Gillantha Variety In The Uk People's Ashes Are Sprinkled In Community Ga-TeluguStop.com

యూకేలోని కార్న్‌వాల్‌లో( Cornwall, UK ) నది ఒడ్డున ఉన్న ఒక ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు కొంతమంది గార్డెనర్లు.అయితే వాళ్లకి ఊహించని చిక్కు వచ్చి పడింది.జనాలు వాళ్ల పూలమొక్కల్లో మనుషుల బూడిద చల్లుతున్నారట.“ఫ్రెండ్స్ ఆఫ్ సన్నీ కార్నర్”( Friends of Sunny Corner ) అనే ఒక స్వచ్ఛంద సంస్థ 2016 నుంచి ట్రూరో నది పక్కన ఉన్న ప్రదేశాన్ని అందంగా మారుస్తూ వస్తున్నారు.కానీ, వాళ్ల కష్టం వృథా పోయేలా ఉందిప్పుడు.ఎందుకంటే ఆ ప్రదేశం జనాలకి బూడిద చల్లడానికి అడ్డాగా మారిపోయింది.అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ చల్లేస్తున్నారు.ఫ్రెండ్స్ ఆఫ్ సన్నీ కార్నర్ ఛైర్మన్ పాల్ కరువానా ప్రకారం, ఇప్పటివరకు కనీసం 15 సార్లు బూడిద చల్లిన ఘటనలు జరిగాయట.

జోక్ ఏంటంటే, ఒకసారి బూడిద చల్లుతుంటే గాలికి ఎగిరి ఒక వాలంటీర్ నోట్లో పడిందట.

Telugu Ashes Cornwall, Communitygarden, Ashes Garden, Memorialgarden, Ashes Uk,

“ఒక వాలంటీర్‌కి గాలి వల్ల నోట్లో నిండా మనిషి బూడిద పోయింది.అది చాలా బాధాకరమైన అనుభవం.‘అది బూడిదే కదా’ అంటారు కానీ అది అనుభవించే వాళ్లకే తెలుస్తుంది” అని కరువానా (71) వాపోయారు.ఈ సమస్యతో విసిగిపోయిన ఫ్రెండ్స్ ఆఫ్ సన్నీ కార్నర్ మొన్న ఫిబ్రవరి 4న ఒక ప్రకటన చేశారు.“ఇక్కడ బూడిద చల్లడం ఆపండి ప్లీజ్” అని చేతులెత్తి మొక్కుతున్నారు.“ఎంత చెప్పినా వినకుండా మళ్లీ ఇవాళ చూస్తే ఒక పెద్ద ఏరియాలో బూడిద చల్లారు” అని వాళ్లు వాపోయారు.అనుమతి లేకుండా బూడిద చల్లడం చట్టరీత్యా నేరం అని గుర్తు చేస్తున్నారు.

మనిషి బూడిదని శుభ్రం చేయడం వాలంటీర్లకు చాలా కష్టంగా, అసౌకర్యంగా ఉంది.

Telugu Ashes Cornwall, Communitygarden, Ashes Garden, Memorialgarden, Ashes Uk,

యూకేలో బూడిద చల్లాలంటే భూమి యజమాని అనుమతి తీసుకోవాలి.పర్యావరణ నిబంధనలు కూడా పాటించాలి.అమెరికాలో అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రూల్ ఉంటుంది.

నేషనల్ పార్కుల్లో అయితే “మెమోరియలైజేషన్”( Memorialization ) కోసం ప్రత్యేక పర్మిషన్ తీసుకోవాలి.ట్రూరో సిటీ కౌన్సిల్ పార్క్స్ ఆఫీసర్ రిచర్డ్ బడ్జ్ కూడా ఈ సమస్యను ఒప్పుకున్నారు.సిటీ పార్కుల్లో ఇలాంటి సమస్యలు లేకపోయినా, సన్నీ కార్నర్ మాత్రం దీనితో చాలా ఇబ్బంది పడుతోందని ఆయన అన్నారు.“బూడిద చల్లితే అది చూసిన వాళ్లకి బాధగా ఉంటుంది.ఎవరైనా బూడిద చల్లాలంటే మమ్మల్ని సంప్రదించి పర్మిషన్ తీసుకోవాలి” అని ఆయన చెప్పారు.కుటుంబ సభ్యులు తమ వాళ్లని గుర్తు చేసుకోవడానికి ప్రశాంతమైన ప్రదేశం కావాలనుకోవడం కరువానాకు అర్థం అవుతుంది.కానీ ఆయన ఒక సింపుల్ సొల్యూషన్ చెప్పారు.“సముద్రం లేదా నది ఇక్కడికి జస్ట్ ఐదు మీటర్ల దూరంలోనే ఉంది కదా.అక్కడే చల్లండి” అని ఆయన అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube