జబర్దస్త్ (Jabardasth)కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కిరాక్ ఆర్పీ (Kirak RP)ఒకరు.ఇలా ఈ కార్యక్రమం ద్వారా తన కామెడీ పంచ్ డైలాగులతో ప్రేక్షకులందరిని మెప్పించిన కిరాక్ ఆర్పీ కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి చేపల పులుసు రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించారు.
ఇలా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు(Nellore Peddareddy Fish Soup) కర్రీ పాయింట్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఇటీవల కాలంలో ఆర్పీ రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఈయన కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ వైకాపా పై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు.ముఖ్యంగా సినీనటి మాజీ జబర్దస్త్ జడ్జిరోజా(Roja) గురించి కూడా ఎన్నో సందర్భాలలో తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు.తాజాగా మరోసారి రోజా జైలుకు వెళ్లడం ఖాయం అంటూ కిరాక్ ఆర్పీ జైలుకు వెళ్లడం ఖాయమంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ రోజా ఇటీవల మహా కుంభమేళాకు వెళ్లినటువంటి విషయం గురించి మాట్లాడారు.

కుంభమేళాకు వెళ్లిన వారు స్నానం చేస్తే ఎవరైనా నిండుగా మునిగితే ఈవిడ మాత్రం సగమే మునిగి ముఖాన్ని పైకే వదిలేసిందని ఆమాత్రం దానికి అక్కడ వరకు వెళ్లడం ఎందుకు అంటూ సెటైర్స్ వేసాడు.అదేవిధంగా రోజా మంత్రిగా ఉన్న సమయంలో వందల కోట్ల అవినీతి చేసిందని తెలియజేశారు.అలాగే ఆమె వితిన్ మూడు నెలలలో జైలుకు వెళ్లడం కూడా ఖాయం అంటూ ఈ సందర్భంగా కిరాక్ ఆర్పి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా వందల కోట్ల అవినీతి చేశారని ఈయన ఆరోపణలు చేశారు.ఇలా రోజా జైలుకు వెళుతుందంటూ ఈయన చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్రదుమారం రేపుతున్నాయి.