ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) తాజాగా పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలాను సృష్టించింది.
అయితే ఈ సినిమా విడుదల ఆయన నేపథ్యంలో రేవతి అనే అభిమాని మరణించడంతో అల్లు అర్జున్ అరెస్టు కావలసి వచ్చింది ఇలా అరెస్టు కారణంగా మేకర్స్ ఎలాంటి ఈవెంట్స్ కూడా నిర్వహించలేదు ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ అల్లు అర్జున్ కి ఏమాత్రం సంతోషం లేకుండా పోయిందని చెప్పాలి.

ఇకపోతే ఈ సినిమాని ఎంతో మంచి సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అలాగే అభిమానులకు చిత్ర బృందం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థాంక్స్ మీట్ ఏర్పాటు చేసన సంగతి తెలిసిందే.ఇక ఈ థాంక్స్ మీట్ కార్యక్రమానికి అల్లు అర్జున్ రావడంతో ఆయన ఏం మాట్లాడతారు అనే విషయాలపై అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ ఎంతో ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారని చెప్పాలి.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయనకు బాలీవుడ్ ( Bollywood )ఇండస్ట్రీ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ క్రమంలోనే బాలీవుడ్ అనే పదం నాకు అసలు నచ్చదు అంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.అయితే తనకు బాలీవుడ్ కంటే కూడా హిందీ సినిమాలు అంటేనే చాలా ఇష్టమని హిందీ అని పలకడమే నచ్చుతుంది అంటూ హాలో అర్జున్ తెలిపారు.ఇక హిందీ భాషలో పుష్ప 2 సినిమా విడుదల అవుతుందని తెలిసి ఏకంగా అక్కడ విడుదల కావాల్సి ఉండగా పుష్ప సినిమా కోసం పోస్ట్ పోన్ చేసుకున్నారు.
ఈ విషయం తెలిసి వెంటనే చిత్ర బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశానని అల్లు అర్జున్ తెలిపారు.ఇలా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాని ఎంతో ఆదరించి సక్సెస్ చేశారని ఈ విజయం అభిమానులకు ప్రేక్షకులకు అంకితం అంటూ తెలియజేశారు.







