సాధారణంగా కొందరికి పడుకున్న వెంటనే నిద్ర పట్టనే పట్టదు.దాంతో ఏం చేయాలో తెలియక తెగ సతమతమవుతుంటారు.
ఈ క్రమంలోనే కొందరు నిద్ర మాత్రలు కూడా వాడుతుంటారు.కానీ, నిద్ర మాత్రలు ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు.
వీటి వల్ల భావిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే న్యాచురల్ పద్ధతుల్లోనే త్వరగానే నిద్ర పట్టేలా చేసుకోవాలి.
మరి అందుకు ఏం చేయాలి.? ఎలాంటి టిప్స్ పాటించాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్ర బాగా మరియు త్వరగా పట్టేలా ప్రేరేపించడంలో చెర్రీ పండ్లు అద్భుతంగా సమాయపడతాయి.
నిద్రించేందుకు గంట ముందు చెర్రి పండ్ల రసం లేదా డైరెక్ట్‌గా పండ్లు తీసుకోవడం చేయాలి.ఇలా చేస్తే చెర్రీ పండ్లలో ఉండే మెలటోనిన్ అనే కంటెంట్ మెదడును రిలాక్డ్ మోడ్‌లోకి తెచ్చేస్తుంది.
దాంతో పడుకోగానే నిద్ర పట్టేస్తుంది.
రాత్రి పూట కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీలు కాకుండా.
గ్రీన్ టీ తీసుకుంటే మంచిది.ఫాస్ట్‌గా నిద్ర పట్టేలా చేయడంలో గ్రీన్ టీ గ్రేట్‌గా సమాయపడుతుంది.
పైగా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు.
చాలా మందికి నిద్రించే ముందు మద్యం తాగే అలవాటు ఉంటుంది.
మద్యం తీసుకుంటే నిద్ర చెడుతుంది.
అందుకే మద్యం బదులుగా ఏ మజ్జిగో తీసుకుంటే.సూపర్ ఫాస్ట్‌గా నిద్రలోకి జారుకుంటారు.
బాదం తీసుకోవడం ద్వారా కూడా త్వరగా పడుకోవచ్చు.
బాదం పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కలిపి తీసుకుంటే.మెడదు మరియు కండరాలు రిలాక్స్ అయి పోతాయి.
ఫలితంగా పడుకున్న వెంటనే నిద్ర పట్టేస్తుంది.
ఇక నిద్రించే ముందు పొర పాటును కూడా స్మోకింగ్ చేయరాదు.
ఎందుకంటే, సిగరెట్‌లో ఉండే నికోటిన్ నిద్రలేమికి దారి తీస్తుంది.సిగరెట్‌కు బదులు ఏ అరటి పండో తీసుకుంటే.
త్వరగా నిద్ర పడుతుంది.