ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరో సైతం రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం ‘ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాడు.
ఇక ఆయన సాధించిన విజయంతో పాటుగా ఆయన భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం వెంకటేష్ వేరే హీరోలకి ఎవరికి సాధ్యం కానీ రీతిలో దాదాపు 400 కోట్ల వరకు కొల్లగొట్టిన ఏకైక సీనియర్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక చిరంజీవి ,బాలయ్య బాబు( Chiranjeevi, Balayya Babu ) లాంటి మాస్ హీరోలను సైతం వెనక్కి నెట్టి ఆయన 400 కోట్ల మార్కెట్ ను రీచ్ అవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.ఇక మీదట కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలను( Family entertainer movies ) చేయడానికి తను ఆసక్తి చూపిస్తానని చెప్పడం విశేషం…ఇక అనిల్ రావిపూడి ( Anil Ravipudi )దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు కామెడీగా సాగుతూ ఉండడం వల్లే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఎక్కువగా ఓన్ చేసుకున్నారు.

తద్వారా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించిందనే చెప్పాలి… మరి ఏది ఏమైనా కూడా విక్టరీ వెంకటేష్ ( Victory Venkatesh )తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి… ఇక తన తదుపరి సినిమా మీద కూడా పూర్తి ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది.మరి అతను అనుకున్నట్టుగానే నెక్స్ట్ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…మరో సూపర్ సక్సెస్ ను సాధిస్తే మాత్రం ఆయన స్టార్ హీరోగా అవతరిస్తాడు…
.