టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ (Tollywood, Bollywood, Kollywood)అనే తేడాల్లేకుండా అన్ని భాషల్లో ఎన్టీఆర్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.ఎన్టీఆర్(NTR) భవిష్యత్తు సినిమాలపై కూడా క్రేజ్ పెరుగుతుండగా వార్2(War 2) సినిమాలో తారక్ కు జోడీగా శ్రద్ధా కపూర్(shradda kapoor) నటిస్తున్నారని తెలుస్తోంది.వార్2 సినిమా ఈ ఏడాది ఆగష్టు నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.సాహో సినిమాతో శ్రద్ధా కపూర్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితం అనే సంగతి తెలిసిందే.
అయితే అల్లు అర్జున్ (Allu Arjun)కు నో చెప్పిన ఈ బ్యూటీ తారక్ కు ఓకే చెప్పడం గమనార్హం.జూనియర్ ఎన్టీఆర్ వార్2(Jr.NTR War 2) సినిమాకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకున్నారని తెలుస్తోంది.ఎన్టీఆర్ రోల్ రెండు షేడ్స్ లో ఉంటుందని హృతిక్, తారక్ (Hrithik, Tarak)కాంబో సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సమాచారం అందుతోంది.వార్2 సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ త్వరలో మొదలుకానున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.శ్రద్ధా కపూర్ కు వార్2 ( shradda kapoor, War2)సినిమాతో ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో చూడాలి.వార్2 సక్సెస్ సాధిస్తే తెలుగులో శ్రద్ధా కపూర్ కు తిరుగుండదు.వార్2 సినిమలో యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేశారని సమాచారం అందుతోంది.వార్2 సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుంది.

వార్2 సినిమా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలను తొలిరోజు కలెక్షన్లతోనే షేక్ చేయడం పక్కా అని చెప్పవచ్చు.వార్2 సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.వార్2 సినిమా ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ సినిమాగా నిలుస్తుందేమో చూడాలి.300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.







