యోగా( Yoga ) అనేది ప్రాచీన భారతీయ సంప్రదాయం.నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు యోగాను తమ దినచర్యలో భాగం చేసుకుంటున్నారు.
ప్రతి ఏడాది జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నారు.శరీరం, మనస్సు, ఆత్మ సమతుల్యతకు యోగా అనేది ఒక ఉత్తమమైన మార్గం.
ఈ నేపథ్యంలోనే యోగాతో ఆరోగ్య లాభాలేంటి? అసలు యోగా చేయడానికి ఏ సమయం అనువైనది? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నిత్యం యోగా చేయడం వల్ల శరీరం తేలిగ్గా మారుతుంది.
శక్తి స్థాయిలు పెరుగుతాయి.నాడీ వ్యవస్థకు( nervous system ) యోగా అనేది చాలా మంచిది.
ప్రాణాయామం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి శరీరంలో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది.రోజూ యోగా చేయడం అలవాటు చేసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
హృదయ సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వెన్నునొప్పి, కీళ్ల నొప్పిని తగ్గించడంలో.
మెటబాలిజం రేటును పెంచి అధిక బరువు సమస్యను దూరం చేయడంలోనూ యోగా సహాయపడుతుంది.

అలాగే యోగాతో శారీరక లాభాలే కాదు మానసిక లాభాలు కూడా ఉన్నాయి.నిత్యం యోగా చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుంది.ధ్యానం మరియు ప్రాణాయామం ద్వారా మనసులో ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి.
యోగా శరీరంలో హ్యాపీ హార్మోన్లు( Happy hormones ) విడుదల చేస్తుంది.మనస్సు మరియు మైండ్ ను ప్రశాంతంగా మార్చి మెరుగైన నిర్ణయాలను తీసుకునేలా ప్రోత్సహిస్తుంది.
దినచర్యలో యోగాను భాగం చేసుకోవడం వల్ల నిద్రలేమి దూరం అవుతుంది.నిద్ర నాణ్యత పెరుగుతుంది.
యోగా మనసును లోతుగా విశ్లేషించుకునేలా చేస్తుంది.మరియు సృజనాత్మకత, ఏకాగ్రతను కూడా పెంచుతుంది.

ఇక ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో యోగా చేయడానికి అనుకూలమైన సమయం.ఆ సమయంలో శరీరం తాజాగా ఉంటుంది.అలాగే సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో కూడా యోగా చేయవచ్చు.ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇది మంచి టైమ్.సులభమైన ఆసనాల నుండి ప్రారంభించి క్రమంగా అభ్యాసం పెంచుకోవాలి.అనుభవం పెరిగిన తర్వాత, ధ్యానం మరియు ప్రాణాయామాన్ని ఎక్కువ సమయం కొనసాగించవచ్చు.
రోజుకు 20 నిమిషాల నుంచి 1 గంట వరకు యోగా చేయడం శరీరానికి, మనస్సుకు చాలా మంచిది.







