యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్(Young Tiger Jr.NTR Prashanth Neel) కాంబో మూవీ షూట్ కొన్ని నెలల క్రితమే మొదలుకావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోంది.ఫిబ్రవరి నెల నుంచి ఈ సినిమా షూట్ మొదలయ్యే అవకాశం ఉన్నా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం లేదు.సాధారణంగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) సినిమా అంటే విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.
ప్రశాంత్ నీల్ (Prashanth Neel)సినిమాలు కానీ ఎన్టీఆర్(NTR) సినిమాలు కానీ చెప్పిన తేదీకి విడుదలైన సందర్భాలు తక్కువగానే ఉన్నాయి.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ 300 నుంచి 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా ఈ సినిమాలో రుక్మిణీ వసంత్(Rukmini Vasant) ఫిక్స్ కాగా త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ అటు తారక్ కెరీర్ లో ఇటు ప్రశాంత్ నీల్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ (Mythri Movie Makers, NTR Arts)సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమా కోసం కన్నడ, హిందీ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఎక్కువ డేట్స్ కేటాయించారని తెలుస్తోంది.

తారక్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కథ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్స్ విషయంలో వేరియేషన్ చూపిస్తుండగా ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ బొద్దుగా కనిపించనున్నారని సమాచారం అందుతోంది.త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి.