కల్కి సినిమాలో పాత్రల సృష్టి వెనుక కథ ఇదే.. ఆ పాత్రల వెనుక ఇంత అర్థముందా?

కల్కి సినిమా( Kalki 2898 AD ) రిలీజ్ కు సమయం దగ్గర పడే కొద్దీ అభిమానులకు, మేకర్స్ కు టెన్షన్ అంతకంతకూ పెరుగుతోంది.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మరిన్ని ప్రయోగాల దిశగా టాలీవుడ్ ఇండస్ట్రీ అడుగులు పడటం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే కల్కి సినిమాలో పాత్రల సృష్టి వెనుక కథ ఇదేనంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

వైరల్ అవుతున్న ఆ వార్తలు మూవీపై అంచనాలను పెంచుతున్నాయి. """/" / శ్రీ మహా విష్ణువు పదో అవతారం కల్కి ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఫిక్షనల్ కథాంశంతో 2898 ఏడీలో జరిగే కథగా ఈ సినిమా తెరకెక్కింది.మహా భారతంలోని అశ్వత్థామ పాత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించడం జరిగింది.

కల్కి అవతార ఆవిర్భావానికి అశ్వత్థామ సహాయాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు.ప్రభాస్( Prabhas ) ఈ సినిమాలో భైరవ అనే బౌంటీ హంటర్ రోల్ లో కనిపించనున్నారు.

భైరవుడు అంటే శివుడి అంశ అనే సంగతి తెలిసిందే. """/" / అశ్వత్థామను సైతం ఎదుర్కొనే బలమైన పాత్రలో భైరవ కనిపించనున్నారు.

కల్కిలో సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్( Kamal Haasan ) కనిపించనుండగా మనిషి ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడటం ఆపనంత వరకు కలి మనల్ని పట్టి పీడిస్తుందని ఈ పాత్ర చెబుతుంది.

దీపిక ఈ సినిమాలో సుమతి పాత్రలో కనిపించనున్నారు.ఆమె కడుపున కల్కి పుడతాడని ప్రమోషన్స్ ద్వారా అర్థమవుతోంది.

అభిమన్యుడి భార్య ఉత్తర పాత్రలో మాళవిక ఈ సినిమాలో కనిపించనున్నారు.అమితాబ్, మాళవిక మధ్య సీన్స్ ఉంటాయని ఉత్తర వల్లే అశ్వత్థామకు శాపం కలుగుతుందని తెలుస్తోంది.

శోభన ( Shobana )ఈ సినిమాలో శంబల మహిళ మరియంగా కనిపించనున్నారు.ప్రభాస్ ఇంటి యజమానిగా బ్రహ్మానందం కనిపించనున్నారు.

ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.కల్కి టికెట్ రేట్లు భారీ స్థాయిలో ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ నీ లాంచ్ చేయడం కోసం చిరంజీవి ఇంత భారీ ప్లాన్ చేశారా ?