ప్రస్తుత రోజుల్లో అధిక బరువు ( Overweight )అనేది కోట్లాది మందిని కలవరపెడుతున్న సమస్య.అధిక బరువు అనేక వ్యాధుల ముప్పును పెంచుతుంది.
శరీర ఆకృతిని పాడు చేస్తుంది.ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం తెగ ట్రై చేస్తూ ఉంటాయి.
అయితే కొన్ని కొన్ని ఆహారాలు బరువు తగ్గడంతో ఎంతో ఉత్తమంగా సహాయపడతాయి.ఫూల్ మఖానా కూడా ఆ కోవకే చెందుతుంది.
ఇతర స్నాక్స్‌తో పోల్చితే ఫూల్ మఖానాలో( Fool Makhana ) కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.అలాగే అధిక ఫైబర్, అధిక ప్రోటీన్ కంటెంట్ ను కలిగి ఉంటాయి.

మఖానాలో మెండుగా ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను( Fiber aids ) మెరుగుపరచి, పొట్ట నిండిన భావనను కలిగిస్తుంది.ఆహార కోరికలను అణచివేస్తుంది.మఖానాలో ఉండే ప్రోటీన్ శరీరంలోని కండరాలను మెరుగుపరచి, మెటాబాలిజాన్ని పెంచుతుంది.ఇది కేలరీలు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.పైగా మఖానాను రాత్రి సమయంలో తిన్నా కూడా తేలికగా జీర్ణమవుతాయి.అందువల్ల బరువు తగ్గాలని భావిస్తున్నవారికి ఫూల్ మఖానా మంచి ఆహార ఎంపిక అవుతుంది.
మఖానాను నేరుగా తినొచ్చు.తక్కువ ఆయిల్ లో వేయించి మిరియాలు, జీలకర్ర ( cumin )చల్లుకుని తినొచ్చు.
సూప్ లేదా కర్రీ రూపంలో కూడా మఖానాను తీసుకోవచ్చు.

అలాగే మఖానాతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.మఖానా డయాబెటిక్ ఫ్రెండ్లీగా ఉంటుంది.రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
లో-సోడియం( Low-sodium ) మరియు హై పోటాషియం కలిగి ఉండే మఖానా రక్తపోటును అదుపులో ఉంచుతుంది.మఖానాలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుండి కాపాడతాయి.
గుండెకు రక్షణ కల్పిస్తాయి.చర్మాన్ని కాంతివంతంగా సైతం మెరిపిస్తాయి.
మరికొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.మఖానా మంచి స్ట్రెస్ బస్టర్ స్నాక్.
అవును, మఖానాలో మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ సమృద్ధిగా ఉంటాయి.ఇవి ఒత్తిడిని చిత్తు చేస్తాయి.
మైండ్ రిలాక్స్ అయ్యేలా ప్రోత్సహిస్తాయి.