సుకుమార్ మా జీవితాలకు అర్థం తెలిపారు.... పుష్ప 3 అద్భుతం... అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ ( Allu Arjun )ఇటీవల నటించిన తాజా చిత్రం పుష్ప 2(Pushpa 2).ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.

 Allu Arjun Emotional Comments On Sukumar At Pushpa 2 Thanks Meet ,sukumar, Pushp-TeluguStop.com

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టు కారణంగా మేకర్స్ ఎలాంటి ఈవెంట్స్ కూడా ఏర్పాటు చేయలేదు  ఇక అల్లు అర్జున్ సైతం మీడియాకు దూరంగా ఉన్నారు.అయితే ఈ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పడం కోసం చిత్ర బృందం థాంక్స్ మీట్ (Thanks Meet)ఏర్పాటు చేశారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ ( Allu Arjun )మాట్లాడుతూ ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం సినిమా గురించి మాట్లాడుతూ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers)వారు లేకపోతే ఇలాంటి సినిమా రావటం సాధ్యం కాదని తెలిపారు.

ఇక పాటలకు మిలియన్ వ్యూస్ వస్తుంటే నేను ఆశ్చర్యపోయే వాడిని కానీ దేవిశ్రీప్రసాద్ మాత్రం వాటిని బిలియన్స్‌లో చూపించాడు.చాలా మంది కొరియోగ్రాఫర్లు హీరోలకు స్టెప్స్‌ నేర్పుతారు.

కానీ, గణేశ్‌ ఆచార్య మాత్రం హావభావాలు ఎలా పలికించాలో చూపించారు.

Telugu Allu Arjun, Pushpa, Pushpa Meet, Sukumar-Movie

ఇలా ఈ సినిమా కోసం వేలమంది ఎంతో కష్టపడి పనిచేశామని అయితే ఈ సినిమా ద్వారా ఇంత మంది జీవితాలకు సుకుమార్ (Sukumar)అర్థం తెలియచేసారని డైరెక్టర్ పై బన్నీ ప్రశంసలు కురిపించారు.ఒక సినిమాకు సంబంధించి ప్రతి ఒక్కరు బాగా నటించవచ్చు కానీ ఆ సినిమాకు హిట్ రావాలి అంటే దర్శకుడు చేతిలోనే ఉంది.మనం ఎంత బాగా నటించినా దర్శకత్వం బాగా లేకపోతే సినిమా సక్సెస్ కాదని మన నటన కాస్త అటు ఇటు ఉన్న డైరెక్షన్ ఫర్ఫెక్ట్ గా ఉంటే సినిమా హిట్ అని బన్నీ తెలిపారు.

Telugu Allu Arjun, Pushpa, Pushpa Meet, Sukumar-Movie

ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయ్యింది అంటే మనం ముందుగా థాంక్స్ చెప్పాల్సింది సుకుమార్ గారికేనని అల్లు అర్జున్ తెలిపారు.ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ చేసిన అభిమానులకు ప్రేక్షకులకు సినిమా అంకితం అంటూ బన్నీ తెలియచేశారు.నా ఆర్మీని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటా.మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తా.పుష్ప3(Pushpa 3).అదేంటో నాకు, సుకుమార్ గారికి తెలియదు కానీ అదొక అద్భుతం అని, అది ఎప్పుడు కార్యరూపం దాలిస్తుందో వేచి చూడాలి అంటూ బన్నీ తెలియచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube