మహా కుంభమేళా ( Maha Kumbh Mela )జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది అక్కడికి వెళ్లి ప్రయాగ్ రాజ్ వద్ద స్నానం చేసి పుణ్యాన్ని పొందాలని అనుకుంటుంటే మరి కొంతమంది మాత్రం కుంభమేళా ద్వారా ఫేమస్ కూడా అయ్యారు.ముఖ్యంగా మోనాలిసా ( Mona Lisa )అనే ఒక పూసలు అమ్ముకునే అమ్మాయి తన కండ్లు చూడటానికి అందంగా ఉండడంతో ఇండియా మొత్తం ప్రస్తుతం ఆమె పేరే వినిపిస్తుంది… ఇక ఏకంగా బాలీవుడ్ నుంచి ఒక మంచి ఆఫర్ కూడా అందుకుంది.
ఒక ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక తనకు మొదటి రెమ్యూనరేషన్ గా 20 లక్షల రూపాయలను( 20 lakh rupees ) కూడా వాళ్ళు ఇవ్వబోతున్నారనే వార్లలైతే వినిపిస్తున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా మోనాలిసా మొదటి సినిమాతోనే 20 లక్షల రెమ్యూనరేషన్ అందుకుంది.అంటే తదుపరి సినిమాల్లో కూడా భారీగా రెమ్యూనరేషన్ అందుకునే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక తెలుగులో ఒక స్టార్ హీరో పక్కన ఇప్పటికే హీరోయిన్ గా సెలెక్ట్ అయిందంటూ వార్తలయితే వస్తున్నాయి.మరి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయాలను బయటకు తెలియజేయడం లేదు.
కానీ మొత్తానికైతే ఒక స్టార్ హీరో పక్కన మోనాలిసా హీరోయిన్ గా నటించబోతుందనే వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మరి దానికి అనుగుణంగానే ఆమె కళ్ళను చూడగానే యూత్ మొత్తం ఆకర్షితులు అయిపోయారు.కాబట్టి ఆమె సినిమాని చూడడానికి కూడా వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.వాళ్ళు అనుకున్నట్టుగానే ఆమె సినిమాల్లో చాలా అందంగా కనిపిస్తుందా? లేదా మరి యాక్టింగ్ లో కూడా ప్రేక్షకుడిని మెప్పిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…చూడాలి మరి ఆమె స్టార్ హీరోయిన్ గా మారుతుందా లేదా అనేది…
.







