టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) గురించి మనందరికీ తెలిసిందే.
ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.ఎన్టీఆర్(NTR) నటించిన సినిమాలన్నీ విడుదల అయ్యి మంచి సక్సెస్ అవుతుండడంతో అదే ఊపుతో మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు తారక్.
ఇకపోతే ఎన్టీఆర్ చివరిగా కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహించిన దేవర (Devara)సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 500 కోట్ల వరకు కలెక్షన్స్ ని సాధించి సూపర్ హిట్ గా నిలిచింది.

బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేసింది.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.పార్ట్ 1 విడుదల అయ్యి మంచి సక్సెస్ అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు పార్ట్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే దేవర పార్ట్ 2(Devara 2 ) స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva),తన టీమ్ తో గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నారట.ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఈ విషయం పట్ల మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక అప్డేట్ రాలేదు.కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ గా మారింది.కాగా ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ వార్ 2 (War 2 )సినిమా తాజాగా పూర్తి అయిన విషయం తెలిసిందే.దీంతో తారక్ దేవర 2 ఫై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.మరి ఈ విషయం పట్ల మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ క్యారెక్టర్ లో నటించి మెప్పించారు.
అనిరుధ్ మ్యూజిక్ అందించారు.ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.