చైనాలో( China ) ఓ హాట్‌పాట్ రెస్టారెంట్ యజమాని చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.ఆయన తన రెస్టారెంట్ ఉద్యోగులకు ఏకంగా రూ.64 లక్షల లాభాన్ని పంచేశారు.క్విలిచువాన్ హాట్‌పాట్ రెస్టారెంట్ చైన్‌కి యజమాని అయిన హువాంగ్ హౌమింగ్ ( Huang Houming )ఈ పని చేశారు.
లాభాలు పంచడం అనేది తమకు ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమని, ఇది పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్ కాదని ఆయన స్పష్టం చేశారు.ఆయనకి మొత్తం ఎనిమిది రెస్టారెంట్లు ఉన్నాయి.చైనా స్ప్రింగ్ ఫెస్టివల్ మూడు రోజులు సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ రెస్టారెంట్లకు ఏకంగా రూ.1.2 కోట్ల అమ్మకాలు జరిగాయి.వచ్చిన లాభాల్లోంచి ఆ రూ.64 లక్షలు ఉద్యోగులకు ఇచ్చేశారు.ఒక్కో బ్రాంచ్ ఎంత సంపాదించిందో చూసి, ఆ లెక్కన ఉద్యోగులకు వాటా ఇచ్చారట.
ఇక బ్రాంచ్ మేనేజర్ అత్యధికంగా ఏకంగా రూ.2.18 లక్షలు తీసుకున్నాడు. మిగతా మేనేజర్లకు కూడా రూ.84 వేలకు పైనే దక్కాయి.ఇక తక్కువ స్థాయిలో పనిచేసే ఉద్యోగులకు కూడా రూ.7,200 నుంచి రూ.8,400 వరకు బోనస్‌లు ఇచ్చారు.ఉద్యోగులు లూనార్ న్యూ ఇయర్‌ని సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానని, అంతేకాదు ఏడాది పొడవునా కష్టపడి పనిచేసినందుకు ఇది వాళ్లకు రివార్డు అని హువాంగ్ చెప్పారు.

ఈ రెస్టారెంట్‌లో 200 మందికి పైగా పనిచేస్తున్నా, బోనస్‌లకు మాత్రం 140 మంది ఉద్యోగులే అర్హులయ్యారు.ఎందుకంటే కొంతమంది పండుగ సమయంలో సెలవులు పెట్టారట.అందుకే వాళ్లను ఈ పంపిణీలో లెక్కలోకి తీసుకోలేదు.అయితే ఇంగ్రిడియెంట్స్ ఖర్చులు, లేబర్ ఖర్చులు( Ingredients costs, labor costs ) తీసేసిన తర్వాత మిగిలిన లాభంలోంచి ఈ మొత్తం లెక్క కట్టారట.
కాకపోతే, అద్దె, కరెంటు బిల్లులు లాంటి ఖర్చులు మాత్రం ఇందులో కలపలేదు.

ఇంకో విషయమేమిటంటే, ఈ పండుగ బోనస్‌లే కాకుండా, ఈ రెస్టారెంట్ వాళ్లు “ఫిలియల్ పియెటీ అలవెన్స్” అని ఒక ప్రత్యేక బెనిఫిట్ కూడా ఇస్తున్నారు.దీని కింద ఉద్యోగుల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందుతుంది.ఈ లాభాలు పంచుతున్న విషయం ఆన్‌లైన్‌లో వైరల్ అయిపోయింది.చాలామంది హువాంగ్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.“ఇది నిజంగా విన్-విన్ సిట్యువేషన్” అని, యజమానితో పాటు ఉద్యోగులు కూడా లాభపడ్డారని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు.ఇంకొకరు అయితే హువాంగ్ మరింత సక్సెస్ అవ్వాలని విషెస్ చెప్పారు.