ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు, దోపిడీలు,మోసాల (Cybercrimes, thefts, frauds)సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది.ఈ విషయం పట్ల పోలీసులు ప్రభుత్వాలు ఎన్ని విషయాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎవరో ఒకరు ఈ మోసాల బారినపడి భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
రోజురోజుకీ ఇలా మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.ఇందులో సామాన్యుల నుంచి ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు చాలామంది మోసపోయారు.
మోసపూరితమైన ఆఫర్ల పేరుతో నమ్మబలికి కోట్లకు కోట్లు దోచేస్తున్నారు కేటుగాళ్ల.అయితే పోలీసులు కేటుగాళ్ళ ప్రపంచానికి పరిచయం చేస్తుంటే విస్తుపోతున్నాము.

ఇటీవల కోఆపరేటివ్ బ్యాంక్ (Cooperative Bank)ఆఫర్ల పేరుతో కొందరు మోసగాళ్లు అయిన సినీ నటులు ప్రజల నుంచి కోట్లకు కోట్లు దోచుకున్న వైనంపై కథనాలు ఆశ్చర్యపరిచాయి.అయితే ఇప్పుడు ఏకంగా ఒక ముఖ్యమంత్రి కుమార్తెకు నాలుగు కోట్ల టోకరా వేశాడు ఒక మోసగాడు.హీరోయిన్ ని చేస్తాను అంటూ మాజీ ముఖ్యమంత్రి కూతురుకి (former Chief Minister daughter) నాలుగు కోట్ల రూపాయల టోకరా వేశాడు.అతడి లీలలు వినే కొద్దీ విస్తుగొలిపేలా ఉన్నాయి.నా సినిమాలో హీరోయిన్ గా నటించండి.5 కోట్లు పెట్టుబడి పెడితే సరిపోతుంది, సినిమాని అమ్మడం ద్వారా నాకు 15 కోట్లు దక్కుతుంది.మీకు ఆఫర్ చేసిన పాత్ర నచ్చకపోతే, తిరిగి సొమ్ముల్ని వెనక్కి ఇచ్చేస్తానని అతడు నమ్మించడంతో మాజీ ముఖ్యమంత్రి కుమార్తె మోసపోయారు.

ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ కుమార్తె ఆరుషి నిషాంక్(Aarushi Nishank ,Uttarakhand Chief Minister Ramesh Pokhriyal Nishank) నకిలీ హీరోయిన్ ఆఫర్ కారణంగా మోసపోయారు.సినిమా తీసాక మూడు రెట్లు సంపాదిస్తానని డబ్బు వెనక్కి ఇస్తానని నమ్మబలకడంతో ఆమె మోసగాడి చేతిలో దారుణంగా మోసపోయింది.స్క్రిప్ట్ రెడీ చేసి తనకు నచ్చిన పాత్రను ఆఫర్ చేస్తానని, ఆ పాత్రతో సంతోషంగా లేకుంటే తన డబ్బును 15 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించేస్తానని కూడా దర్శక నిర్మాతలు హామీ ఇచ్చారట.
అయితే ఆశ్చర్యకరంగా ఆరుషికి ఆశించిన పాత్ర దక్కలేదు.డబ్బు కూడా తిరిగి చెల్లించలేదట.చాలా కాలం వేచి చూసినా ప్రయోజనం లేకపోవడంతో బాధితురాలు మోసపోయానని గ్రహించి ఆరుషి డెహ్రాడూన్ లోని కొత్వాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.ముంబై నివాసితులు మానసి వరుణ్, వరుణ్ ప్రమోద్ లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మినీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారిక పేజీలో చిత్ర బృందం నకిలీ ఫోటోలను ఉంచి, మోసపూరిత ఉద్దేశ్యంతో ఆరుషి ఫోటోలను తొలగించారని కూడా పోలీసులు దర్యాప్తులో తేల్చారు.ఆరుషి తన డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా వారిని కోరగా, ఆమెను చంపుతామని, కుటుంబ ప్రతిష్టను దెబ్బతీస్తామని వారు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.





 

