బడ్జెట్ రూ.4 కోట్లు.. యానిమల్ కలెక్షన్లను దాటేసింది.. ఈ సినిమా ఏదో మీకు తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన సినిమాలు కొన్ని కొన్ని సార్లు బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్ ని చవి చూస్తూ ఉంటాయి.కొన్ని కొన్ని సినిమాలు చిన్న సినిమాలుగా విడుదల అయ్యి పెద్ద పెద్ద సక్సెస్ లు సాధిస్తూ ఉంటాయి.

 Kiran Rao Laapataa Ladies Movie Beat Sandeep Reddy Vanga Film Animal Netflix Det-TeluguStop.com

అంటే చిన్న బడ్జెట్ తో నిర్మితమైన సినిమాలు కోట్లలో కలెక్షన్స్ను సాధిస్తూ ఉంటాయి.అలాంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే సినిమా కూడా ఒకటి.

అమిర్‌ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు( Kiran Rao ) దర్శకత్వం వహించిన చిత్రం లపతా లేడీస్.( Laapataa Ladies ) ఈ చిత్ర నిర్మాతల్లో అమిర్ ఖాన్‌ కూడా ఉన్నారు.

ఈ చిత్రం మార్చి 1న థియేటర్లలో రిలీజ్ అయింది.తక్కువ బడ్జెట్‍తో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.20 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది.థియేటర్లలో హిట్ టాక్‌ తెచ్చుకున్న లాపతా లేడీస్ గత నెల 26న ఓటీటీ స్ట్రీమింగ్‌ వచ్చింది.

ఈ చిత్రానికి హిట్‌ టాక్‌ రావడంతో ఓటీటీలోనూ దూసుకెళ్తోంది.తాజాగా ఈ చిత్రం సరికొత్త రికార్డ్ సృష్టించింది.

సందీప్ రెడ్డి వంగా చిత్రం యానిమల్‌ను( Animal Movie ) అధిగమించింది.కేవలం 30 రోజుల్లోనే రికార్డ్ స్థాయి వ్యూయర్‌ షిప్‌ను సొంతం చేసుకుంది.నెట్‌ఫ్లిక్స్‌లో( Netflix ) స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం రికార్డు స్థాయిలో 13.8 మిలియన్ వ్యూస్‌ సాధించింది.కేవలం నెల రోజుల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది.ఈ విషయాన్ని కిరణ్ రావు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు.ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube