ఏపీ ఎన్నికలు : సర్వే సంస్థలకే వణుకు పుడుతోందా ? 

ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాలు ( Assembly election results )ఏ విధంగా ఉంటాయి .ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయంలో సరైన క్లారిటీ రావడం లేదు.

 Are The Ap Elections Shaking The Survey Companies-TeluguStop.com

కాకపోతే ఎవరికి వారు గెలుపు తమదే అన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.వైసిపి తాము రెండోసారి అధికారంలోకి వస్తామని , గతంలో వచ్చిన 151 స్థానాలకు మించి స్థానాలు దక్కుతాయని ధీమాగా చెబుతుండగా, కూటమి పార్టీలైన టిడిపి, జనసేన, బిజెపిలు( TDP, Janasena, BJP ) మెజార్టీ సీట్లు తామే దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయి.

దీంతో జనాల్లోనూ దీనిపై ఒకటి కన్ఫ్యూజన్ కనిపిస్తోంది.ఇక ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు తమ రిపోర్ట్ ను ఇచ్చాయి.

కొన్ని కూటమికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి.అయితే పూర్తిస్థాయిలో ఫలితం ఎలా ఉండబోతుంది అనది మాత్రం ఏ సర్వే సంస్థ దిమాహత్ బయటకు చెప్పలేని పరిస్థితి నెలకొంది.

Telugu Ap, Ap Survy, Janasena, Janasenani, Ys Jagan-Politics

గతంలో మాదిరిగా సర్వే సంస్థలు ఫలితం ఎలా ఉండబోతుంది అనేది చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాయి.ఏపీతో పాటు, వివిధ రాష్ట్రాల్లో ఐదు దశలలో పోలింగ్ ముగిసింది.వీటిలో అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి.మరో రెండు దశల్లో ఎన్నికలు మిగిలి ఉన్నాయి.ఇప్పటి వరకు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలను పరిగణలోకి తీసుకుంటే.ఏపీలో జరిగిన పోలింగ్ పైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

పోలింగ్ మూసిన తర్వాత సర్వే సంస్థలు చాలావరకు సైలెంట్ అయ్యాయి.క్లారిటీగా ఫలితం చెప్పలేకపోతున్నాయి.

ప్రస్తుతం ఎన్నికల కోడ్ నిబంధనలు కూడా అడ్డుగా ఉండడంతో, సర్వే సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి.

Telugu Ap, Ap Survy, Janasena, Janasenani, Ys Jagan-Politics

కానీ తెలంగాణ ఎన్నికల్లో( Telangana elections ) కూడా ఇదే నిబంధనలు ఉన్నా.పోలింగ్ ముగిసిన మరుసటి రోజు ఎగ్జిట్ పోల్స్ సర్వే పేరుతో కాకుండా, అధ్యయనం అంచనాలంటూ పేర్లు మార్చి వెల్లడించారు.గత ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదే విధంగా వ్యవహరించారు.

కానీ ఇతర రాష్ట్రాలకు ఏపీ కి చాలా వ్యత్యాసం ఉంది.ఏపీలో విభిన్నమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి.

వ్యక్తిగత కక్షలు, రాజకీయ దాడులు ఎక్కువ కనిపించాయి.దీంతో సర్వే సంస్థలు కూడా కాస్త ఆలోచనలు పడ్డాయి.

దీనికి తగ్గట్లుగానే జనాల నాడి ఏ విధంగా ఉందనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితుల్లో సర్వే సంస్థలు ఉన్నట్టుగా కనిపి స్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube