మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది.ఈ క్రమంలో జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హైకోర్టు(High Court) ఆదేశాలు జారీ చేసింది.
ఎమ్మెల్యే పిన్నెల్లితో(MLA Pinnelli) పాటు మరి కొందరికీ న్యాయస్థానం రిలీఫ్ ఇచ్చింది.కేతిరెడ్డి పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, చింతమనేని ప్రభాకర్ మరియు జేసీ అస్మిత్ రెడ్డికి ఉపశమనం కలిగింది.
అయితే జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉందని హైకోర్టుకు విన్నవించారు.
వాళ్ల అభ్యర్థనను అంగీకరించిన ధర్మాసనం ఇప్పుడే అరెస్ట్ చేయొద్దని తెలిపింది.అదేవిధంగా నిందితుల కదలికలపై పోలీసులు నిఘా ఉంచాలని పేర్కొంది.
వారిని పర్యవేక్షణ చేయాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.