పిఠాపురం ప్రచారంపై జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్!

ఇటీవల ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గం లో జబర్దస్త్ ( Jabardasth ) కమెడియన్లు  మొత్తం ప్రచార కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొన సంగతి మనకు తెలిసిందే.పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) మద్దతు తెలియజేస్తూ జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్స్ మొత్తం పిఠాపురం( pitapuram ) లో ఉంటూ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.

 Shakalaka Shankar Interesting Comments On Pitapuram Election Campaign, Pitapuram-TeluguStop.com

అయితే తాజాగా ఈ ప్రచార కార్యక్రమాల గురించి షకలక శంకర్ ( Shakalaka Shankar ) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.గత ఎన్నికలలో మాదిరిగా ఈసారి ఎన్నికలకు నేను ఎలాంటి డబ్బు ఖర్చు చేయలేదని ఈయన తెలిపారు.

2019వ సంవత్సరంలో సుమారు మూడు లక్షలకు పైగా నా డబ్బు ఖర్చు చేసుకొని భోజనాలు పెట్టించి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించాను.ఇలా డబ్బు ఖర్చు చేయడంతో నా భార్య నాతో నాలుగు రోజులు మాట్లాడలేదని మా మామయ్య గారు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ కోసం ఇంత చేసావు కనీసం ఆయన ఫోన్ అయినా చేశారా అని ప్రశ్నించారు.ఒకానొక సమయంలో అవును నిజమే కదా అయినా నేను అభిమానంతో చేశాను వారికి తెలిస్తే ఏంటో తెలియకపోతే ఏంటి అని భావించాను.

ఇక 2024 ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో కూడా వారం రోజుల పాటు పిఠాపురంలో ప్రచారం చేసామని అయితే ఈసారి మాత్రం నేను రూపాయి కూడా ఖర్చు పెట్టుకోలేదని తెలిపారు.నేను ఉండడానికి తినడానికి నా బండి డీజిల్ కి మొత్తం జనసేన వాళ్లే ఖర్చు పెట్టుకున్నారని తాను ఎలాంటి ఖర్చు పెట్టుకోలేదు అంటూ ఈ సందర్భంగా షకలక శంకర్ జనసేన ప్రచార కార్యక్రమాల గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ ప్రచార కార్యక్రమాలలో భాగంగా జబర్దస్త్ కమెడియన్లు, సీరియల్ నటీనటులు మెగా హీరోలందరూ కూడా పాల్గొని ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube